twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Hari Hara Veera Mallu: పవన్ పాత్రపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్ క్రిష్.. ఇంతవరకు ఎవరు చేయని విధంగా..

    |

    ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. కొందరైతే ఒకసారి అటువైపు అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. తదుపరి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేయాలని ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ లాంటి వారు కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

    ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అయితే కంటిన్యూ పవన్ పాన్ ఇండియా సినిమా చేయక పోవచ్చు కానీ హరి హరి వీరమల్లు మాత్రం కంప్లీట్గా అన్ని ప్రముఖ భాషల్లో విడుదల కానున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాన్ని ఇటీవల దర్శకుడు క్రిష్ బయట పెట్టాడు.

    అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు..

    అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు..

    దర్శకుడు క్రిష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా స్క్రీన్ ప్లే లోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే అతడి సినిమాలకు ఒక ప్రత్యేకమైన అభిమానం అనేది ఉంటుంది. అంతే కాకుండా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లో అగ్ర హీరో నుంచి చిన్న హీరోల వరకు అతనితో సినిమా చేయాలని అనుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది కొద్ది మంచి క్రియేటివ్ దర్శకుల్లో క్రిష్ టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు.

    కొండపొలంకు పాజిటివ్ టాక్..

    కొండపొలంకు పాజిటివ్ టాక్..

    దర్శకుడు క్రిష్ శుక్రవారం కొందపోలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమాను చాలా రోజులకు వాయిదా వేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఒక చదువుకున్న అబ్బాయి గానే కాకుండా గొర్రెల కాపరి గా కూడా కనిపించబోతున్నాడు.

    కథ రాసుకున్నప్పుడే.. పవన్ ఫిక్స్

    కథ రాసుకున్నప్పుడే.. పవన్ ఫిక్స్

    ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో దర్శకుడు క్రిష్ తన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇలాంటి సినిమా రాలేదని అందుకే కథ రాసుకున్నప్పుడే హీరోగా ఆయననే ఫిక్స్ అయినట్లు తెలియజేశారు.

     రాబిన్ హుడ్ తరహాలో..

    రాబిన్ హుడ్ తరహాలో..

    సినిమా కంప్లీట్ గా 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని పవన్ పాత్ర కూడా రాబిన్ హుడ్ తరహాలో చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను ఆధారంగా చేసుకొని కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు క్రిష్ తెలియజేశాడు.. ఇప్పటివరకు తెలుగులోనే ఇలాంటి సినిమాను ప్రేక్షకులు చూడలేదని కూడా ఈ దర్శకుడు నమ్మకంగా తెలియజేశాడు. ఇక మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉందని చెప్పిన క్రిష్ గతంలో శివమ్ అనే కథ గురించి కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు. అయితే ఆ కథ అనుకున్నట్టుగా సెట్ అవ్వకపోవడంతో తర్వాత చేద్దామని అనుకున్నట్లు కూడా తెలియజేశాడు.

    English summary
    Director krish about pawan kalyan Hari Hara Veera Mallu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X