Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్రెండ్ ఫాలో అవుతున్న క్రిష్.. డేరింగ్ స్టెప్.. యువత కోసం బోల్డ్ కథ
టాలీవుడ్ దర్శకుల్లో జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) శైలి ప్రత్యేకమే. ఎన్నడూ కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడలేదు. తాను నమ్మిన సిద్దాంతాలు, విలువలతోనే చిత్రాలను తెరకెక్కించాడు. అందుకే ఓ గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి చిత్రాలు వచ్చాయి. ఇవన్నీ దర్శకుడిగా క్రిష్ స్థాయిని పెంచినవే. ఆయను ఓ గౌరవాన్ని తీసుకొచ్చినవే. అయితే ఈ మధ్య క్రిష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.

బెడిసికొట్టిన ‘ఎన్టీఆర్'
నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన చిత్రం ఎన్టీఆర్. కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్ట్స్‌గా క్రిష్ మలిచాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు ఘోరపరాజయాన్ని చవిచూశాయి. ఈ దెబ్బతో క్రిష్ పునరాలోచనలో పడ్డాడు. అందుకే మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి ఇన్ని రోజులు పట్టింది.

మణికర్ణిక వివాదం..
ఝాన్సీ లక్ష్మీబాయీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన మణికర్ణిక చిత్ర వివాదాస్పదంగా మారింది. మధ్యలో ప్రాజెక్ట్‌ను వదిలేసి పోయాడని కంగనా ఆరోపించగా.. స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలంటే కంగనా ఒత్తిడి చేసిందని క్రిష్ ఆరోపించాడు. ఇలా వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. దీంతో క్రిష్ నిత్యం వార్తల్లోకెక్కాడు.
|
తాజాగా పవన్ ప్రాజెక్ట్‌తో బిజీగా..
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. చకచకా ప్రాజెక్ట్‌లకు ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ ప్రారంభం కాగా.. క్రిష్ కాంబోలో రాబోయే పీరియాడిక్ సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు. ఓ చారిత్రాత్మక కథను, చరిత్ర విస్మరించిన ఓ వీరుడి కథను చెప్పబోతోన్నట్లు తెలుస్తోంది.

క్రిష్‌లోని ఇంకో కోణం..
అయితే ఇప్పటి వరకు క్రిష్ తీసిన సినిమాలు చూస్తే.. ఆయన ఓ క్లాస్ దర్శకుడని ఎవ్వరైనా టక్కున చెప్పేస్తారు. క్రిష్ బోల్డ్ కథలు కూడా రాయగలడని ఎవ్వరైనా ఊహించి ఉంటారా? కానీ అది నిజం కాబోతోంది. అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ‘మస్తీ' అనే ఓ బోల్డ్ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. దీనికి క్రిష్ మసాలా కథను అందించాడని టాక్. దీంట్లో నవదీప్, హెబ్బా పటేల్ నటిస్తున్నారు. ఈ మేరకు నవదీప్ షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.