Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అందుకే డైరెక్టర్ మారుతి డిఫరెంట్.. గోపీచంద్ మూవీపై వెరైటీ ప్రకటన
గత కొన్ని రోజులుగా దర్శకుడు మారుతి కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల కోసం మారుతి కష్టపడుతున్నాడు.. మెగా కాంపౌండ్ హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని రకరకాలుగా కామెంట్లు వచ్చాయి. ఎన్నో మార్లు మారుతి వాటిని ఖండిస్తూ ట్వీట్లు కూడా పెట్టాడు. సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక రీసెంట్‌గా రవితేజ మారుతి ప్రాజెక్ట్ కూడా వార్తల్లోకి ఎక్కింది.
రవితేజ పన్నెండు కోట్లు డిమాండ్ చేయడంతో బడ్జెట్ సెట్ కాలేదని తెలుస్తోంది. అందుకే రవితేజకు బదులుగా గోపీచంద్‌ను తీసుకుంటున్నాడని రూమర్లు వచ్చాయి. తాజాగా అదే నిజమైంది. గోపీచంద్‌తో తన కొత్త సినిమాకు సంబంధించిన అప్దేట్‌ను వెరైటీగా ప్లాన్ చేశారు. అనేక రూమర్లు వచ్చాయని, ఈ కేసుల కోర్టుల వరకు వెళ్లిందని తక్షణమే మారుతి గోపీచంద్ కాంబోలో రాబోతోన్న ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వాలని యూవీ, గీతా ఆర్ట్స్ 2 సంస్థలను కోర్డు ఆదేశిస్తున్నట్టు ఓ వీడియోను షేర్ చేశారు.

ఇలా వెరైటీగా తన సినిమా అప్డేట్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాజిటివిటీతో 2021ని మొదలెట్టడం ఎంతో బాగుంది.. గోపీచంద్ గారు నా నెక్ట్స్ హీరో.. నా ఫ్రెండ్స్ యూవీ, గీతా ఆర్ట్స్‌తో కలిసి పని చేయడం మళ్లీ వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది.. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ త్వరలోనే రాబోతోందంటూ మారుతి ట్వీట్ చేశాడు.