ది రాజా సాబ్ బడ్జెట్ 400 కోట్లు.. బండబూతులు తిట్టారు.. డైరెక్టర్ మారుతీ వైరల్ కామెంట్స్

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ రొమాంటిక్ లవ్ స్టోరీలను తెరకెక్కించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం విజయవంతమైంది. భారీ స్థాయిలో హిట్స్ అందుకోకపోయినా టాలీవుడ్ లో మారుతీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందనే బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకో కలిగారు. ఇక ప్రస్తుతం మారుతీ అగ్ర హీరోలను డైరెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

రెబల్ స్టార్ ప్రభాస్ - మారుతీ దర్శకత్వంలో హార్రర్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ది రాజా సాబ్ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. తొలిసారిగా మారుతీ టాప్ హీరోను డైరెక్ట్ చేస్తుండటం విశేషంగా మారింది. ఈ చిత్రం ప్రకటించిన తర్వాత ప్రొడక్షన్ సంస్థ నుంచి కొన్ని ఇబ్బందులు రావడం, బడ్జెట్ లో ఇబ్బందులు తదితర అంశాలతో సినిమా నిర్మాణం కాస్తా ఆలస్యమైంది. మొత్తానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రంగంలోకి దిగిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతూనే వస్తోంది.

Director Maruthi Revealed The Raja Saab Movie Actual Budget

అయితే ది రాజా సాబ్ చిత్రానికి అసలు బడ్జెట్ ఎంత అవుతుందనేది అందరిలో ఒక సందేహం నెలకొంది. మారుతీతో ప్రభాస్ సింపుల్ సినిమా ఒకటి తీసుకుందామని భావించారంట. కానీ అది కాస్తా భారీ బడ్జెట్ ఫిల్మ్ గా మారిపోయిందని ప్రచారం జరిగింది. ఇక దీనిపై తాజాగా దర్శకుడు మారుతీనే స్వయంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సినిమాలకు కథలు రాయడం ఎప్పుడో మానేశాను. నాకు డబ్బులు సంపాదించడం రాక కాదు. నేను 4 రోజులు కూర్చున్నానంటే చిన్న సినిమాలకు 100ల డైలాగ్స్ రాయగలను. ఎందుకు పెద్ద సినిమాలు తీస్తున్నానేది ఆలోచించాలి.

థియేటర్లలోకి ప్రేక్షకులకు కుటుంబంతో సహా రావాలని, క్వాలిటీ సినిమా అందించాలని ప్రయత్నిస్తున్నాను. ఈరోజుల్లో, బస్టాఫ్ వంటి సినిమాలతో డబల్ మీనింగ్ డైలాగ్ రాశానని, బూతు డైరెక్టర్ అంటే నన్ను తిట్టారు. కానీ ఇవ్వాళ 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ది రాజా సాబ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఇక్కడ చూడాల్సింది నా గ్రాఫ్, నా కెరీర్. ఊరికనే ఎవ్వరూ పాన్ ఇండియా డైరెక్టర్స్ అయిపోరు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నాకు ఒక ఫ్లాప్ సినిమా ఉన్నా కూడా పిలిచి డైరెక్షన్ ఇచ్చారు. అందుకు కారణం ప్రభాస్ మనస్సులో నాకు ఉన్న స్థానం. అందుకే ఇది సాధ్యమైంది. ఆయన నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.. అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ది రాజా సాబ్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు మాళివికా మోహన్, నిధి అర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్ సరసన నటిస్తున్నారు. విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండటం విశేషం. అలాగే సముద్రఖని, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఈ చిత్రం 2026 జనవరి 9న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X