Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జాంబీరెడ్డి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఆలస్యమవ్వడానికి కారణమిదే!
అ! సినిమాతో డిఫరెంట్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ తరువాత కల్కి సినిమాతో కూడా డిఫరేంట్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అయితే అంధించలేదు. ఇక మూడవసారి నెవర్ బిఫోర్ అనే ప్రయోగంతో రాబోతున్నాడు.
టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో మొదటిసారి ఒక జాంబీ ఫిల్మ్ ను తెరకెక్కించినట్లు చెబుతూ తప్పకుండా సినిమా ఊహాలకందని రేంజ్ లో థ్రిల్ చేస్తుందని ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఓ వర్గం ఆడియెన్స్ లో ఈ సినిమా అంచనాలనైతే పెంచేసింది. ఇక సినిమా మొదట్లో సంక్రాంతికే వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 5న రానున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.

సినిమా ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని చెబుతూ.. సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్న తరుణంలో రిస్క్ చేయడం అంత కరెక్ట్ కాదని కొంతమంది ఇండస్ట్రీ పెద్దవాళ్ళు వద్దని అన్నారని అందుకే సినిమాను ఫిబ్రవరి 5న థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు ప్రశాంత్ వివరణ ఇచ్చారు. ఈ సినిమాలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించగా దక్ష నగర్కర్ హీరోయిన్ గా కనిపించనుంది.