నన్ను ఫస్ట్ కౌగిలించుకున్న అమ్మాయి అనుష్క శెట్టి.. అప్పుడే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి: ప్రశాంత్ వర్మ
టాలీవుడ్ లో విభిన్నమైన కంటెంట్ తో సినిమాలు చేయగలిగే అతికొద్ది మంది యువ దర్శకులతో ప్రశాంత్ వర్మ ఒకరు. ఎలాంటి సినిమా చేయాలని అనుకున్నా కూడా తెలుగులో ఇప్పటివరకు రాలేని జానర్స్ ను టచ్ చేయాలని అనుకుంటాడు. ప్రస్తుతం ప్రశాంత్ కమర్షియల్ గా పెద్ద హిట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క మొదటి కౌగిలింత గురించి చెప్పాడు.

నాని సొంత ప్రొడక్షన్ లో
పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రశాంత్ వర్మ మొదట అ! సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాను నాని సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కించిన విషయం తెలిసిందే. సినిమా కమర్షియల్ గా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు గాని దర్శకుడిగా ప్రశాంత్ కు మంచి గుర్తింపు లభించింది.

డిఫెరెంట్ కంటెంట్ తో ప్రయోగాలు
ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా ఇప్పటివరకు తెలుగులో అలాంటి సినిమా రాలేదు అనేలా ఉంటాయి. కంటెంట్ సెలక్షన్ లో ఈ దర్శకుడు ఆలోచించే విధానం చాలావిబిన్నంగా ఉంటుంది. అయితే కమర్షియల్ గా మాత్రం మనోడు అనుకున్నంతగా సక్సెస్ అవ్వడం లేదు.

హిట్టు సినిమాకు సీక్వెల్
అ! సినిమా అనంతరం రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేశాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది గాని బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. ఇక జాంబీ రెడ్డి మాత్రం ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక నెక్స్ట్ అదే సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. ఈసారి జాంబీ రెడ్డి 2తో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు.
Recommended Video

అనుష్క అలా హగ్ ఇవ్వగానే.. కన్నీళ్లు
ఇక రీసెంట్ గా తరుణ్ భాస్కర్ 'మీకు మాత్రమే చెప్తా' అనే టాక్ షోలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ అనుష్క శెట్టి ఇచ్చిన హగ్ గురించి వివరణ ఇచ్చారు. అ! సినిమా ప్రివ్యూ షోకు వచ్చినప్పుడు కొన్ని సీన్స్ చూడగానే అనుష్క వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సూపర్ హిట్ ఆనేశారు. ఇక సినిమా మొత్తం చూశాక మరోసారి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. నా జీవితంలో నన్ను హగ్ చేసుకున్న ఫస్ట్ అమ్మాయి తనే. అలా కాంప్లిమెంట్ ఇవ్వగానే నాకు కన్నీళ్లు ఆగలేవు.. అని ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











