twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kantara ఇబ్బందుల్లో పడేసింది, అందులో చెక్ చేసుకునేలా చేసింది: రాజమౌళి

    |

    ఒక చిన్న సినిమాగా కన్నడ నాట విడుదలైన కాంతార సినిమా దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది. ముందుగా కన్నడలో రిలీజైన ఈ సినిమా ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యశ్ నటించిన కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన హోంబలే ఫిలీంస్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

    దీంతో మరోసారి హోంబలే ఫీలింస్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు హీరోగా, డైరెక్టర్ గా మెస్మరైజ్ చేశాడు రిషబ్ శెట్టి. క్లైమాక్స్ చివరిలో తన నట విశ్వరూపం చూపించి ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కాంతార సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    రూ. 400 కోట్లుకు పైగా కలెక్షన్స్..

    రూ. 400 కోట్లుకు పైగా కలెక్షన్స్..

    కన్నడ చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా అదరగొట్టింది. కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కర్ణాటకలో సెప్టెంబర్ 30న విడుదలైంది. అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో 15 రోజుల తర్వాత ఇతర భాషల్లోకి (తెలుగు, హిందీ, తమిళం) డబ్ చేసి విడుదల చేశారు.

    ఇతర భాషల్లో కూడా తన సత్తా చాటి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

    ఆలోచనలో పడేసింది..

    ఆలోచనలో పడేసింది..

    కాంతార సినిమాపై ఇటీవల దర్శకధీరుడు రాజమౌలి స్పందించారు. ఇటీవల ఓ బాలీవుడ్ ఇంటర్వ్యుకి హాజరైన రాజమౌళి కాంతార సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తాయని కాంతార సినిమా నిరూపించింది.

    భారీ బడ్జెట్ చిత్రాలు ప్రత్యేకమే. కానీ, కాంతార వంటి చిన్న సినిమా కలెక్షన్స్ లో మ్యాజిక్ చేసింది. సినిమా మేకింగ్ భారీగా ఉండాలనుకునే నాలాంటి వాళ్లను ఈ సినిమా ఇబ్బందుల్లో పడేసింది. భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించే దర్శకులని ఈ సినిమా ఆలోచనలో పడేసింది. సినిమా నిర్మాణ వ్యయాన్ని మరోసారి సమీక్షించుకునేలా చేసింది.

    రూ. 2 కోట్లకు హక్కులు..

    రూ. 2 కోట్లకు హక్కులు..

    ఇక నుంచి మేము సినిమా మొదలు పెట్టేటప్పుడు బడ్జెట్ ని ఒకటికి రెండు సార్లు పునఃపరిశీలించుకోవాలి. ఫిల్మ్ మేకర్స్ గా మనం ఏం చేస్తున్నామనే విషయాన్ని ఓసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది" అని రాజమౌళి తెలిపారు.

    ఇదిలా ఉంటే కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా కర్ణాటకలో రూ. 168.50 కోట్లు వసూళ్లను సాధించగా హిందీలో రూ. 96 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.

    English summary
    RRR Movie Director Rajamouli Interesting Comments On Rishab Shetty Kantara Movie Budget And Success
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X