మహేష్ బాబుతో అలాంటి సినిమా తీయాలనుంది.. లిటిల్ హార్ట్ డైరెక్టర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..
Sai Marthand- Mahesh Babu: "టాలెంట్ ఎవరి సొత్తు కాదు... ఎవరి జీవితంలో వాడే హీరో" అనే మాటలు కొంతమంది ఎదిగిన విధానం చూస్తే నిజమే అనిపిస్తుంటాయి. అవును. సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. కానీ పట్టుదల, ప్యాషన్, టాలెంట్ ఉంటే ఎవ్వరినీ ఆపలేరు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, చిన్న కాన్సెప్ట్ వీడియోలతో తన క్రియేటివ్ సైడ్ చూపించిన ఈ యువ దర్శకుడు, చివరికి 'లిటిల్ హార్ట్స్'అనే సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాడు. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు.. సాయి మార్తాండ్ . మనోడి కెరీర్ చూసినవారికి పై డైలాగ్స్ ఖచ్చితంగా నిజమనే అనిపిస్తాయి. ఈ యంగ్ డైరెక్టర్ ప్యూచర్ ప్లాన్స్ మామూలుగా లేవు. ఏకంగా మహేష్ బాబుతోనే సినిమా తీయాలని ఉందట. ఇంతకీ ఆ కథేంటీ ? మీరు కూడా ఓ లూక్కేయండి.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన యువ దర్శకుడు సాయి మార్తాండ్. తన తొలి చిత్రం "లిటిల్ హార్ట్స్"తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచారు. అప్ కమ్మింగ్ యాక్టర్ మౌళి, శివాని నాగరం లను హీరో, హీరోయిన్‌లుగా తీసుకుని 'లిటిల్ హార్ట్స్' అనే కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామా తెరకెక్కిన విధానం సూపర్. ఈ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రియలిస్టిక్ కథనం, మ్యూజిక్, రొమాంటిక్ సన్నివేశాలు, భావోద్వేగ పీక్‌లతో సినిమా ప్రత్యేక గుర్తింపు సొంత చేసుకుంది.

మొత్తానికి 'లిటిల్ హార్ట్స్' అనే కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేసి సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం 2.5 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.45 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయంతో సాయి మార్తాండ్ హాట్ టాఫిక్ గా మారారు. ఈ సినిమా సక్సెస్ తో ఆయన పేరు ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ల జాబితాలోకి తీసుకెళ్లింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాయి మార్తాండ్ పాల్గొన్నారు. ఈ సమయంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మహేష్ బాబు నా డ్రీమ్ హీరో
ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. "నేను చిన్నప్పటి నుంచే మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు వల్లే సిని ఇండస్ట్రీలోకి రావాలనిపించింది. ఒకరోజు ఆయనతో సినిమా చేయడం నా కల," అని తెలిపారు. ఆయన మాటల్లో నిజమైన అభిమానం, గౌరవం స్పష్టంగా కనిపించింది. డైరెక్టర్ సాయి మార్తాండ్ తన కల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ "మహేష్ బాబుతో చేసే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన చేయని ఒక కొత్త సెటప్‌లో కథను మలుస్తాను. మహేష్ గారి గ్లామర్, స్టైల్, ఎమోషన్‌ను కొత్త కోణంలో చూపించేలా కథ రాస్తున్నాను. ఇది సాధ్యమైతే నా జీవితంలో గొప్ప క్షణం అవుతుంది," అని అన్నారు.
సాయి మార్తాండ్‌కు డిమాండ్
'లిటిల్ హార్ట్స్' బ్లాక్‌బస్టర్ విజయంతో నిర్మాతలు ఇప్పుడు సాయి మార్తాండ్ వైపు చూస్తున్నారు. ఆయన కథలలో నేచురల్ ఎమోషన్, మ్యూజికల్ సెన్సిబిలిటీ, ఫీల్‌గుడ్ టచ్ ఉంటాయని సినీ వర్గాలు అంటున్నాయి. యువ దర్శకుడైనప్పటికీ సాయి మార్తాండ్ మేకింగ్ స్టైల్‌లో మేచ్యూరిటీ కనిపిస్తుందని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం సాయి మార్తాండ్ రెండు సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరో ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలూ రొమాంటిక్ థీమ్‌లతో కూడిన యూత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌గా ఉండనున్నట్లు సమాచారం.
సాయి మార్తాండ్ మహేష్ బాబు పట్ల చూపిన అభిమానం, ఆరాధన చూసి ఫ్యాన్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే "సాయి మార్తాండ్ - మహేష్ బాబు కాంబినేషన్ "అంటూ ట్రెండ్స్ మొదలయ్యాయి. సాయి మార్తాండ్ సింప్లిసిటీ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. మొత్తానికి, లిటిల్ హార్ట్స్ సినిమాతో టాలీవుడ్‌లో కొత్త సక్సెస్ కథ రాసిన సాయి మార్తాండ్, ఇప్పుడు మహేష్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ యంగ్ డైరెక్టర్ తో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.


Click it and Unblock the Notifications











