For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ది గేమ్ చేంజింగ్ డ్రగ్ వచ్చేసింది.. అదే మింగండి,చప్పట్లు కొట్టుకోండి.. టాలీవుడ్ దర్శకుడి ఆసక్తికర పోస్ట్!

  |

  ఆనందయ్య కరోనా నాటు మందు, కెమికల్ ఇంజనీర్ మల్లిక్ పరచూరి గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచినా కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేష్ తాజాగా ఒక సంచలన పోస్ట్ పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే

  ది గేమ్ చేంజింగ్ డ్రగ్ ఈజ్

  ది గేమ్ చేంజింగ్ డ్రగ్ ఈజ్

  Ok...ది గేమ్ చేంజింగ్ డ్రగ్ ఈజ్ అరైవింగ్ సూన్.. జూన్ 9 నుంచి నేను రెండు మూడు సార్లు ప్రపంచం ఈ కరోనా బారి నుంచి ఊపిరి పీల్చుకో పోయే ఒక డ్రగ్ రాబోతుంది అని పోస్ట్ చెయ్యటం జరిగిందని, ఆ డ్రగ్ తాలూకు 3rd ఫేస్ డీటెయిల్స్ లో అద్భుతమైన విషయాలు తెలిశాయని అన్నారు.. మీకు ఆనందయ్య నాటు మందు మీద నమ్మకం ఉంటే అదే మింగండి... మెంతులు కాపాడతాయి అనుకుంటే అవే తినండి.. మెడికల్ మాఫియా అని చప్పట్లు కొట్టుకోండి. సైన్స్ ను, డాక్టర్లను అవహేళన చేయబోయిన వారిపై కూడా ఈ డ్రగ్ పని చేస్తుందని అన్నారు.

  5 కంపెనీలు కలిసి కట్టుగా

  5 కంపెనీలు కలిసి కట్టుగా

  మిత్రులు Dr. ఏవీఎస్ రెడ్డి ఈ డ్రగ్ రీసెర్చ్ పై స్వయంగా పని చేసి...మనకి అందించిన వివరాలు ఇవన్న ఆయన ఆ డ్రగ్ పేరు #MOLNUPIRAVIR ఎలా పని చేస్తుంది ఈ మాత్ర .. మీ మల్లిక్ పరుచూరి భాషలో అర్థం కావాలంటే.. మీ ఒంట్లో చేరిన కరోనా వైరస్, పిల్లలు పెట్టే సమయంలో కాపీయింగ్ లోపాలను సృష్టిస్తుంది ఈ molnupiravir మాత్ర. కాపీయింగ్ లో వచ్చిన errors ద్వారా పిల్లలు పుట్టడం తగ్గి, ప్రాణాంతక సిట్యుయేషన్ నుంచి కాపాడుతుంది. దాధావు 5 కంపెనీలు... ఈ డ్రగ్ విషయంలో కలిసి కట్టుగా పని చేశారని అన్నారు.

  డెల్టా ప్లస్ తో సహా

  డెల్టా ప్లస్ తో సహా

  1200 మంది మీద జరిగిన ఈ ట్రయల్స్ లో.. ఈ మందు తీసుకున్న వారిలో దాదాపు 60 శాతం 5 రోజుల్లో,80 శాతం 10 రోజుల్లో కరోనా లక్షణాల నుంచి ఉపశమనం పొందారు. ప్రామాణిక చికిత్స తీసుకున్న వారికంటే వీరు 4 రోజుల ముందుగానే కోలుకున్నారని పేర్కొన్న ఆయన అలాగే 5 రోజుల్లో 75 శాతం,10 రోజుల్లో 90 శాతం మంది కి RT PCR -Ve వచ్చింది ఈ మందు అన్ని వేరియంట్స్ మీద పని చేస్తుందా? దీని పని తీరు కారణంగా ప్రస్తుతానికి ఇది అన్ని రకాల SARS-CoV2 వైరస్ లను నిలువరించగలదు. డెల్టా ప్లస్ తో సహా అని ఆయన పేర్కొన్నారు.

  ఈకలు పీకే ప్రయత్నం చేయకండి

  ఈకలు పీకే ప్రయత్నం చేయకండి

  భవిష్యత్ లో నిరోధకత వస్తుందేమో ఇప్పుడే చెప్పలేము. కాబట్టి నువ్వు గేమ్ చేంజర్ అన్నావ్...మళ్ళీ వచ్చింది అని నా ఈకలు పీకే ప్రయత్నం చేయకండి... సైన్స్ ఎప్పుడూ తనను తాను కరెక్ట్ చేసుకుంటూనే ఉంటుంది దాన్ని ఎలా తీసుకోవాలి? RT PCR +ve అని తెలిసిన వెంటనే రోజుకు రెండు సార్లు 5 రోజుల పాటు తీసుకోవాలి. మోతాదు: ఉదయం 800 mg (4x200mg), సాయంత్రం 800mg (4x200mg)భోజనం తర్వాత అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

  సైడ్ ఎఫెక్ట్స్

  ఇక ఈ మెడిసిన్ తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ అంటే వికారం, విరోచనాలు, తలనొప్పి వంటివి రావచ్చని అన్నారు. . మార్కెట్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? వివిధ కంపెనీలు చేసిన క్లినికల్ ట్రయల్స్ యొక్క మధ్యంతర సమాచార విశ్లేషణా ఫలితాలు ప్రస్తుతం DCGI వారు పరిశీలిస్తున్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ చివర్లో అందుబాటులోకి రావచ్చని అన్నారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని ఆయన అన్నారు.

  English summary
  director Sai Rajesh sayssa The Game Changing Drug is arriving soon. molnupiravir is Game Changing Drug, here is the details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X