RAPO19: సడన్ గా రామ్ సినిమా సెట్ లో ప్రత్యక్షమైన స్టార్ డైరెక్టర్ శంకర్.. ఎందుకంటే?
ఇస్మార్ట్ శంకర్ సినిమా అనంతరం కాస్త స్టైల్ ను మార్చిన రామ్ పోతినేని ఎలాగైనా తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకుముందు చేసిన రెడ్ సినిమా అయితే అంతగా సక్సెస్ కాలేదు. దీంతో నెక్స్ట్ చేయబోయే సినిమా అంతకు మించి అనేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు. లింగుస్వామితో బైలాంగ్యువల్ సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
రామ్ 19వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ విభిన్నమైన షేడ్స్ తో కనిపిస్తాడని ఒక టాక్ అయితే వస్తోంది. ఇక ఇటీవల కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చాడు. చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ లో బిజీగా ఉండగా డైరెక్టర్ శంకట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ పనులు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. లింగుస్వామితో మంచి స్నేహం ఉండడం వల్లనే శంకర్ సినిమా సెట్స్ లోకి వచ్చాడు.

ఇక శంకర్ రాకతో ఆశ్చర్యపోయిన చిత్త బృందం ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కొంతసేపు డైరెక్టర్ లింగుస్వామి మేకింగ్ ను కూడా గమనించారు. హీరో రామ్ తో పాటు హీరోయిన్ కృతి శెట్టిని కూడా ప్రత్యేకంగా పలకరించారు.

ఇక సినిమా కొసం దేవిశ్రీప్రసాద్ సెట్ చేసిన ఒక ట్యూన్ ను కూడా శంకర్ కు ప్రత్యేకంగా వినిపించగా చాలా అద్భుతంగా ఉందని శంకర్ కొనియాడారు. తెలుగు తమిళ్ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక సినిమాకి ఉస్తాద్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











