రాజమౌళి స్టూడెంట్ మొదటి సినిమా రిలీజ్ ఎప్పుడంటే.. మొత్తానికి క్లారిటీ ఇచ్చేశారు!
అగ్ర దర్శకుడు రాజమౌళి ఎన్నో బడా సినిమాలు తెరకెక్కించారు గాని ఇంతవరకు ఆయన నుంచి వచ్చిన శిష్యులు ఎవరు కూడా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఒకవైపు సుకుమార్ లాంటి దర్శకుడి నుంచి టాలెంటెడ్ దర్శకులు వస్తున్నప్పటికీ జక్కన్న, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకుల నుంచి యువ దర్శకులు ఎక్కువగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదు.
ఇక ప్రస్తుతం రాజమౌళి ఒక స్టూడెంట్ పై మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళితో పాటు బాహుబలి సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి గ్యాప్ లేకుండా వర్క్ చేసిన అశ్విన్ గంగరాజు ఆకాశవాణి అనే ఒక డిఫరెంట్ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటించాడు. వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ వంటి అప్ కమింగ్ యాక్టర్స్ కూడా ప్రధాన పాత్రలో నటించారు.

ఇక కీరవాణి తనయుడు కాల బైరావ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. సినిమా కథ వినగానే రాజమౌళి చాలా బావుందని ప్రశంసలు అంధించాడట. ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్ రాగా అందులో నిజం లేదని చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. మళ్ళీ పరిస్థితులు సాదారణ స్థితిలోకి వచ్చిన తరువాతే సినిమాను డైరెక్ట్ గా థియేటర్స్ లో విడుదల చేస్తామని చెప్పారు. మరి సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











