twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా స్టైల్ అలాగే ఉంటది.. ఎన్టీఆర్ బయోపిక్ విషయాలు చెప్తే దుమారమే: తేజ సంచలనం

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లలో కెల్లా తేజ ది ప్రత్యేకమైన పోకడ. తనకు నచ్చినట్లుగానే ఉండటం, ఎవ్వరేమనుకున్నా తన స్టైల్ లోనే సినిమా తీయడం తేజకు మాత్రమే సాధ్యం అని చెప్పుకోవచ్చు. ఇక ఇంటర్వ్యూ లలో పాల్గొంటే రామ్ గోపాల్ వర్మ కు తమ్ముడిలా అదే స్టైల్ లో ముక్కుసూటిగా మాట్లాడుతుండటం తేజ లోని మరో కోణం. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బయోపిక్ విషయమై సెన్సేషనల్ గా మాట్లాడారు తేజ.

    బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్

    బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్

    తండ్రి జీవిత కథను వెండితెరపై చూపించాలనే దృఢ సంకల్పంతో తానే నిర్మాతగా మారి లీడ్ రోల్ పోషించి ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అనే రెండు భాగాలుగా భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు.

    ముందుగా తేజ తోనే ముహూర్తం

    ముందుగా తేజ తోనే ముహూర్తం

    ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను ముందుగా తేజ చేతిలోనే పెట్టారు నందమూరి బాలకృష్ణ. తేజ దర్శకత్వం అంటూనే రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభ కార్యక్రమాలు కూడా జరిగాయి. మొదటి షాట్ కు క్లాప్ పడింది. కానీ ఏం జరిగిందో తెలియదు అనూహ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ కు తాను న్యాయం చేయలేనేమో అంటూ తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, ఆ బాధ్యతలను క్రిష్ తన భుజాలపై వేసుకోవడం జరిగింది.

    అనుకున్నదొకటి.. అయ్యిందొకటి

    అనుకున్నదొకటి.. అయ్యిందొకటి

    డైరెక్టర్ క్రిష్ అటు పక్క తన పెద్ద ప్రాజెక్ట్ మణికర్ణిక వదిలేసి ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే పనిలో పడ్డారు. బాలకృష్ణ సహా భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. దీంతో తప్పకుండా క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్నట్లుగా రెండు భాగాల ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సుమన్నాడు.

    తేజ రియాక్షన్

    తేజ రియాక్షన్

    తేజ ముందుగా ఈ ప్రాజెక్ట్ చేయబోయి తప్పుకున్నారు కాబట్టి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బయోపిక్ పై మీ రియాక్షన్ ఏంటని అడిగారు మీడియా ప్రతినిధులు. దీనికి సమాధానమిచ్చిన తేజ..''ఎన్టీఆర్ సినిమాను నేను చూడలేదు. ఒకవేళ నేను చేసుంటే ఏదైనా మీడియా సమావేశంలో ఆ సినిమా గురించి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాల్సి వస్తుంది. ఒకేవేళ తప్పుగా మాట్లాడితే అది పెద్ద గొడవ అవుతుంది. అందుకే సినిమా చూడకుండా ఉండటమే బెటర్ అనుకున్నా'' అని ఆశ్చర్యపరిచారు.

    ఎన్టీఆర్‌ను మీరే డైరెక్ట్ చేసుంటే

    ఎన్టీఆర్‌ను మీరే డైరెక్ట్ చేసుంటే

    ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఒకవేళ ఎన్టీఆర్ ను మీరే డైరెక్షన్ చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదనుకుంటున్నారు అనే ప్రశ్న కూడా ఆయనకు ఎదురైంది. దీనికి బదులిచ్చిన ఆయన.. ''నేను గనక ఆ సినిమాను తెరకెక్కించి ఉంటే మరింత దారుణమైన ఫలితం వచ్చేదేమో'' అని మరింత ఆసక్తికర సమాధానం చెప్పడం విశేషం.

    English summary
    In latest Interview director Teja talk about N.T.R. Kathanayakudu and N.T.R: Mahanayakudu movies. And he use sensetional comments on that biopic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X