twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతి వెధవా సినిమా గురించి నోటికొచ్చినట్టు వాగేవాడే.. పుష్ప నెగటివ్ కామెంట్స్ మీద దర్శకుడి షాకింగ్ కామెంట్స్!

    |

    సూపర్ హిట్ గా నిలిచిన అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా విడుదలైన నెలరోజుల తర్వాత ప్రవచనకర్త గరికపాటి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే టీఆరెస్ నేత ఒకరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అలా మాట్లాడుతున్న అందరినీ ఉద్దేశిస్తూ ఒక దర్శకుడు సుదీర్ఘంగా స్పందించారు. ఆ వివరాలు

    హక్కు ఎక్కడ ఏడిసింది?

    హక్కు ఎక్కడ ఏడిసింది?


    మనసంతా నువ్వే సినిమా దర్శకుడు వీఎన్ ఆదిత్య తన ఫేస్ బుక్ వేదికగా సుదీర్ఘంగా స్పందించారు. వీళ్ళఇద్దరి మధ్య అనే యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడనికి సిద్దమవుతున్న ఆయన కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఎంతమందినని తిట్టాలి, ఎన్నిసార్లు ఖండించాలి? ఎందరితో గొడవలు పెట్టుకోవాలి ?ఎందుకురా ఎవరి జోలికి వెళ్లని సినిమా వాళ్ళని ఇలా నోటికొచ్చినట్టు అనేస్తున్నారు, నిన్న గాక మొన్న హిందూ ధర్మ ప్రచార కర్త, ప్రవచనకర్తగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాయన కూడా ఆల్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాని అకారణంగా ఆడిపోసుకున్నారని అన్నారు. పుష్ప సినిమాని అంత విమర్శించిన ఆ పెద్ద మనిషి, మరి హిందూ ధర్మం గురించి ఒక కమర్షియల్ సినిమాలో కూడా అద్భుతంగా చెప్పిన అఖండ సినిమాని ప్రశంసించలేకపోయారేం? మంచిని ప్రశంసించలేని సంకుచిత స్వభావికి చెడుని విమర్శించే హక్కు ఎక్కడ ఏడిసింది? అంటూ ఆదిత్య ప్రశ్నించారు.

    ప్రతి వెధవా నోటికొచ్చినట్టు వాగేవాడే

    ప్రతి వెధవా నోటికొచ్చినట్టు వాగేవాడే


    ఈయనే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటని తిట్టకుండా, ఆకాశం అమ్మాయైతే పాటని పొగుడుతూ, చెడుని వదిలేసి, మంచి ఎక్కడున్నా దాన్ని గుర్తించాలన్నారు, మరిప్పుడేమైంది? అని ఆదిత్య ప్రశ్నించారు. అలాగే కొత్తగా ఏదో పదవి వచ్చి వేదికనెక్కి ఓ వెర్రి వెధవ పుష్ప సినిమా తీసిన వాళ్లను చెప్పుతో కొట్టాలంటాడు.. సరే కొట్టేద్దాం.. ఆ సినిమా కలెక్షన్స్ అంతా వాడిని టేబుల్ మీద పెట్టమని, అది ఆ యూనిట్ కి, టికెట్ కొన్న ప్రజలకు ఇచ్చి అప్పుడు కొడదాం.. ఇవ్వగలడా.. రూపాయి జేబులోంచి తీసి పక్కన ఉన్నవారికి ఇవ్వలేని ప్రతి వెధవా ఆడిన సినిమా గురించి నోటికొచ్చినట్టు వాగేవాడే అంటూ టీఆరెస్ నేత గురించి కూడా ఘాటుగా స్పందించారు.

    దమ్ముంటే ఆవిడని అనాలి

    దమ్ముంటే ఆవిడని అనాలి

    మొన్నా మధ్యన హిందూ ధర్మ ప్రచార కర్తగా అన్నమయ్య సంకీర్తనల సాధన కోసం ప్రభుత్వం దగ్గర అప్పనంగా స్థలం చేజిక్కించుకున్న ఒక పెద్దావిడ గీతా జయంతి అన్నమయ్య భక్తి గీతంతోనో, కృష్ణుడి గీతా శ్లోకంతోనో కాకుండా, అప్పుడే పాపులర్ అయిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ని పేరడీ చేసి, గీతా జయంతి శుభాకాంక్షలు చెప్పారు, ఎంత సిగ్గుచేటు.. ఆవిడని ఒక్క మాట అనలేని చవట దద్దమ్మలు అందరూ కలిసి ఆ విషయం ప్రెస్ మీట్ లో ఆనందంగా చెప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ని నానా మాటలూ అన్నారు. దమ్ముంటే ముందు ఆవిడని అనాలి కదా అంటూ ఐటెం సాంగ్ వివాదం గురించి స్పందించారు.

     నీతి సినిమాలు తీస్తాడా?

    నీతి సినిమాలు తీస్తాడా?


    సినిమా అనేది చూసే ఇంట్రెస్ట్ ఉన్న ప్రేక్షకుల కోసం తీస్తారు.. నచ్చితే ప్రేక్షకుడు ఆదరిస్తాడు, నచ్చకపోతే తిరస్కరిస్తాడు. ఇదొక కళాత్మక వ్యాపారం.. కళ అనే నది వెళ్లి వ్యాపారం అనే సముద్రంలో కలవడమే ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమా.. ఇది కూడా కొన్ని కోట్ల మందికి జీవనోపాధి కలిగించే ఒకానొక రంగం. రాజకీయ రంగంలో లేని ఒక్క సినిమా వాడన్నా ఎదురెళ్లి ఒక్క విమర్శ ఎవరినైనా ఎప్పుడైనా చేశాడా.. ఏ వేదిక మీదన్నా ? ప్రత్యేకంగా ఏదో ఒక కులాన్నో, మతాన్నో కించపరిచే సినిమా తీసినప్పుడు మనోభావాలు దెబ్బ తిని విమర్శించారంటే అర్ధం ఉంది.. అవేమీ లేని సినిమా వాళ్లని, సినిమాలని, ఇంత సంస్కార హీనంగా, ఇంత నిర్లజ్జగా , నిస్సిగ్గుగా , అసహ్యంగా మాట్లాడే నీచ సంస్కారం సమాజానికి ఉన్నప్పుడు ఆ సమాజం నుంచి వచ్చిన సినిమా వాడు బూతు సినిమాలు తీయకుండా నీతి సినిమాలు తీస్తాడా? అని ప్రశ్నించారు.

    పిచ్చి వెధవల్లారా

    పిచ్చి వెధవల్లారా

    "నీ అద్దం సినిమా రా దద్దమ్మా.. ", నువ్వెలా ఉంటే సినిమా రంగం అలా ఉంటుంది, నువ్వు సంస్కారివైతే బాహుబలి, రంగస్థలం, అత్తారింటికి దారేది, శతమానంభవతి, సైరా, అఖండ కనిపిస్తాయి. నువ్వు లోఫరు గాడివైతే నీకు చీకట్లో చితక్కొట్టుడు, నువ్వు స్టూడెంట్ వైతే అర్జున్ రెడ్డి, మాస్ గాడివైతే పుష్ప , ఖైదీ నెంబర్ 150, సమరసింహారెడ్డి, ఇంద్ర కనిపిస్తాయి. నీకేది నచ్చితే అది నీ మానసిక స్థాయి. నీ తాత్కాలిక ఆనందం. అడ్డమైన ప్రతి వెధవా సినిమాని, సినిమా వాళ్లని నోటికొచ్చినట్టు వాగడానికి కూడా టికెట్ పెడితే, మీ ఆస్థులమ్ముకుని రోడ్డున పడతారు పిచ్చి వెధవల్లారా అంటూ ఆయన తన బాధను వెళ్లగక్కారు.

    మొగుళ్లు లేరా.. పెళ్లాలు లేరా?

    మొగుళ్లు లేరా.. పెళ్లాలు లేరా?

    ఒక సినీ గాయని అభిమానుల కోసం భర్తతో ఫోటో పెడితే .. బాడీ షేమింగ్, నోటికొచ్చినట్టు వాగడం, అదే పని ఏ సినిమా వాడన్నా ఒక నాన్ సినిమా వాడి పేజీ మీద కెళ్ళి ఒక్క చిన్న విమర్శ చేశారా ఇప్పటిదాకా.. మరి మీకేంట్రా అంత చులకన? మీకు మొగుళ్లు లేరా.. పెళ్లాలు లేరా? కళను , కళాకారులను గౌరవించుకోలేని కుసంస్కారమైన కుళ్లిన నీ సమాజాన్ని, ఆలోచనల్ని ముందు నువ్వు శుభ్రం చేసుకో, అంతే ఆటోమేటిక్ గా మా సినిమా రంగం బాగుపడుతుందని అన్నారు. సినిమా వాడు చనిపోయిన రోజు కూడా కడుపుబ్బరం ఆపుకోలేక విషం విరజిమ్ముతున్న సర్పాలు మీరు.. కనీస జీవన మర్యాద కూడా కోల్పోయిన కుళ్లుబోతులు మీరు, శ్రీ చాగంటి గారు శంకరాభరణం సినిమాని పొగిడారు గానీ మరే సినిమానీ ఇంతవరకూ ఆయన విమర్శించలేదు.. అదీ సంస్కారం అంటే ధర్మ ప్రవచనాలు వల్లించే వారు, ఆధ్యాత్మిక వేత్తలు , నేర్చుకోవాల్సింది ఇదని అన్నారు.

    Recommended Video

    Actor Siddu Jonnalagadda Exclusive Interview Part 2 | Ma Vintha Gadha Vinuma
    ప్రశ్నలు వేస్తూనే

    ప్రశ్నలు వేస్తూనే

    మీ విష సంస్కృతి చూస్తే ఒక పౌరుడిగా నాకు ఆందోళనగా, మీలో ఒకడిగా లేనందుకు, కేవలం రెండు శాతం సక్సస్ రేటుకే మీరింత కుమిలి కుమిలి ఏడుస్తున్న అత్యంత పవర్ ఫుల్ మాధ్యమం అయిన సినిమారంగంలో ఉన్నందుకు గర్వంగానూ ఉంది. మమ్మల్ని తిడుతూ మీరు దిగజారుతారా..మాలో మంచిని ప్రోత్సహిస్తూ మీ స్థాయి పెంచుకుంటారా మీ విచక్షణ కే వదిలేస్తున్నా..మేమయితే ఆపేదేలే.. తగ్గేదేలే అంటూ ఆయన సినిమాను, సినిమా వాళ్ళను టార్గెట్ చేసి మాట్లాడుతున్న అందరినీ అందరికీ ఒకేసారి ప్రశ్నలు వేస్తూనే సమాధానం ఇచ్చారు.

    English summary
    Director V.n Aditya Made sensational comments on people who are criticizing moviee and movie makers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X