Just In
- 35 min ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 1 hr ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 2 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Finance
నిర్మల సీతారామన్ బడ్జెట్ పైన స్టార్టప్స్ అంచనాలు
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Sports
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్‌కు బరోడా!
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్: దృశ్యం దర్శకుడు కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దృశ్యం సినిమా ఫేమ్ నిషికాంత్ కామత్ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయూకి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఆరోగ్యం చికిత్సకు సహకరీంచలేదని తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితమే నిశికాంత్ ప్రాణాలు వదిలినట్లు సమాచారం.


లివర్ సిర్హోసిస్‌తో బాదపడుతున్న నిషికాంత్
గత కొంత కాలంగా దర్శకుడు నిషికాంత్ లివర్ సిర్హోసిస్‌తో బాధపడుతూన్నట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఇక సన్నిహితులు సలహా ద్వారా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

మృత్యువుతో పోరాడిన దర్శకుడు
అయితే ఇటీవల వ్యాధి తీవ్రత ఎక్కువవ్వడంతో ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లు ముందుగానే బంధువులు మీడియాకి తెలియజేశారు. వెంటనే ICUకి తరలించి నాలుగు రోజుల నుంచి వైద్యులు తీరిక లేకుండా చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. మృత్యువుతో ఇన్ని రోజులు కఠినంగా పోరాడిన నిశికాంత్ కొద్దీ సేపటి క్రితమే కన్నుమూశారు. ఆగస్టు 17 సోమవారం సాయంత్రం 4.24 గంటలకు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.

అప్పటి నుంచి నిశికాంత్ రేంజ్ పెరుగూతువచ్చింది.
50ఏళ్ళ నిషికాంత్ బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన ముంబై మేరీ జాన్ ఆమె సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన నిషికాంత్ అనంతరం మళయాళం హిట్టు సినిమా దృశ్యం సినిమాను హిందీలో అజయ్ దేవ్ గన్ తో రీమేక్ చేసి హిట్టు కొట్టడు. అప్పటి నుంచి నిశికాంత్ రేంజ్ పెరుగూతువచ్చింది.

నెక్స్ట్ దర్బాదార్ అనే సినిమాతో రావాలని..
మదారీ, ఫంగే, ఫోర్స్ వంటి సినిమాలకు చిత్రాలకు దర్శకత్వం వహించిన నిషికాంత్, జాన్ అబ్రహం రాకీ హాండ్సమ్ చిత్రంలో కూడా నటించారు. ఇక నెక్స్ట్ దర్బాదార్ అనే సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించి దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకోవాలని అనుకున్నాడు. ఆ సినిమాను 2022లో రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతలో ఆయన మరణించడం బాలీవుడ్ ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.

ఉదయం నుంచే మరణించారనే వార్త
అయితే సోమవారం ఉదయం నుంచే నిషికాంత్ మరణించారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దర్శకుడు నిషికాంత్ కామత్ బతికే ఉన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందుతున్నది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడాం. ఇంకా ఆయన పోరాటం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకొందాం అని బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు. కానీ చివరకు విధితో పోరాటంలో అలసిపోయిన నిషికాంత్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దాంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.