For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పొలిటికల్ సెటైర్‌గా క్లైమాక్స్.. అన్ని వర్గాలకు నచ్చేలా.. డాక్టర్ రాజేంద్రప్రసాద్

  |

  కైపాస్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ప‌తాకంపై పి రాజేశ్వ‌ర్‌రెడ్డి, కే క‌రుణాక‌ర్ రెడ్డి తెరకెక్కించిన క్లైమాక్స్ చిత్రంలో సినియర నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఓ విభిన్నమైన పాత్ర‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అభిరుచి గల డైరెక్టర్ భవానీ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో భవానీ శంకర్ దర్శకత్వం వహించిన డ్రీమ్ చిత్రానికి ఏడు అంత ఏడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్, సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

  క్లైమాక్స్ చిత్రం షూటింగు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకొంటున్న సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. దర్శకుడు భవాని శంకర్‌ గతంలో రూపొందించిన డ్రీమ్ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించాను. ఆ చిత్రానికి రాయల్ రీల్ అనే ప్రతిష్టాత్మక అవార్డుతోపాటు మరో 7 అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కానీ అది ఓ వర్గం ప్రేక్షకులకి మాత్రమే నచ్చిందనేది మా ఇద్దరి అభిప్రాయం. అందుకే ఈసారి కామెడీ, లవ్, ఫామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్ ఇలా అన్ని కలబోసి మల్టీ జానర్ కథతో వస్తున్నాం. ఇవన్నీ ఒకే కథలో ఎలా వస్తాయి అని మీరనుకుంటుంటే, ఖచ్చితంగా క్లైమాక్స్ చూడాల్సిందే. ప్రస్తుతం విడుదల చేసిన క్లైమాక్స్ చిత్ర మోషన్ పోస్టర్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నది. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా ఉండే మా చిత్రాన్ని త్వరలోనే మీ అందరి ముందుకు తీసుకొస్తాం" అన్నారు.

  Dr. Rajendra Prasad: Bhavani Shankar’s Climax impress everyone

  దర్శకుడు భవాని శంకర్ క్లైమాక్స్ చిత్రం గురించి మాట్లాడుతూ.. రాజకీయ విమర్శనాస్త్రంగా తెరకెక్కిన క్లైమాక్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. డా. రాజేంద్రప్రసాద్ సహా మిగితా పాత్రలు చాలా థ్రిల్లింగ్ గాను, ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తొలిసారి మల్టి జానర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. క్లైమాక్స్ మూవీ మోషన్ పోస్టర్‌ను రాజేంద్రప్రసాద్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే క్లైమాక్స్ కి సంబందించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.

  నిర్మాతలు పీ రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ .. మా క్లైమాక్స్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. విభిన్నమైన కథ, ఉత్కంఠ భరిత కథనంతో తెరకెక్కింది. మోషన్ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. పొలిటికల్ సెటైర్‌గా వస్తున్న మా చిత్రంలో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్‌తోపాటు ఇతర సీనియర్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మాకు నమ్మకముంది అని తెలిపారు.

  నటీనటులు: శ్రీరెడ్డి, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్, సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు
  నిర్మాతలు: పీ రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి
  సంగీతం: రాజేష్‌ నిధివన
  కెమెరా: ర‌వికుమార్ నీర్ల‌
  కొరియోగ్ర‌ఫీ: ప్రేమ్‌ర‌క్షిత్‌
  ఎడిటింగ్‌: బ‌స్వా పైడిరెడ్డి
  ఆర్ట్: రాజ్‌కుమార్‌

  English summary
  Acclaimed Writer/Director/Producer Bhavani Shankar’s upcoming Multi-genre flick 'Climax' Motion Poster is out starring Sr. Hero Dr. Rajendra Prasad, Sri Reddy, Prudhvi Raj and Shivashankar Master in prominent roles. Produced by P Rajeshwar Reddy, and K Karunakar Reddy, Climax is known to be a Political Satire written around an entertaining murder mystery with intriguing characters throughout the plotline. Wrapping up the shoot & post production works, makers of Climax are now ready for its Theatrical release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X