బాలయ్య ఫాన్స్ బీ రెడీ.. ఆరోజు ట్రిపుల్ ధమాకా.. తగ్గేదేలే!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈపాటికి సినిమా రిలీజ్ పనులు ముమ్మరంగా సాగుతుండేవి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఆ విషయం పక్కన పెడితే బాలకృష్ణ పుట్టినరోజు మరికొద్ది రోజుల్లో రాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ పదో తేదీన బాలకృష్ణ తన 61వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆయన పుట్టిన రోజున ఫ్యాన్స్ కి మరపురాని రోజుగా మార్చేందుకు బాలకృష్ణ టీం ప్రయత్నిస్తోందని అంటున్నారు.
ఆరోజున మొత్తంగా మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ బాలకృష్ణ అభిమానులకు అందే అవకాశం ఉందని అంటున్నారు. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ బాలకృష్ణ పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే అదే రోజు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా అదే రోజు రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ అనిల్ రావిపూడితో కలిసి పని చేస్తున్నారని ప్రచారం ముందు నుంచి జరుగుతూ వస్తోంది. ఇక దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా అదే రోజున రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక అదే రోజు బాలకృష్ణ ఈ మధ్యకాలంలో రికార్డు చేసిన ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాక వీలైతే అదే రోజున అఖండ సినిమా నుంచి పోస్టర్ తో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ట్రైలర్ కు తగ్గట్టు కంటెంట్ దొరక్కపోతే అప్పుడు పోస్టర్ రిలీజ్ చేసి ఊరుకుంటారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











