Don't Miss!
- News
వైఎస్ వివేకా హత్య కేసులో మున్ముందు అనూహ్య పరిణామాలు?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
బెల్లంకొండ మీద ఛీటింగ్ కేసు, ముందు అప్పని తరువాత మోసం.. ఫిర్యాదు చేసిన మరో నిర్మాత!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఆయన తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇద్దరి మీద ఛీటింగ్ కేసు నమోదైంది. తన డబ్బు ఎగ్గొట్టడం కాక అడిగితే బెదిరిస్తున్నారు అంటూ ఒక నిర్మాత కం ఫైనాన్షియర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఒక సినిమా గురించి జరిగిందని అంటున్నారు. అసలు ఏం జరిగింది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రవణ్ కుమార్ ఫిర్యాదు
నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లపై వీఎల్ శ్రావణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ చీటింగ్ కేసు పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2018 - 2019 మధ్య కాలంలో సినిమా నిర్మాణం కోసం బెల్లంకొండ సురేష్, సాయి శ్రీనివాస్ రూ. 85 లక్షలు తీసుకున్నారని, అప్పటి నుంచి తిరిగి ఇవ్వడానికి నిరాకరించారని శ్రవణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు విచారణలో
తన డబ్బు తనకు తిరిగి చెల్లించమని అడిగినప్పుడు సురేష్ అలాగే శ్రీనివాస్ తనను బెదిరించారని కూడా శ్రవణ్ ఆరోపించాడు. ఆ ఇద్దరూ తనను మోసం చేశారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ఎప్పటికీ తెరకెక్కని ఒక సినిమాలో నిర్మాణ భాగస్వామిని చేస్తానని హామీ ఇవ్వడంతో తాను కొంతమంది సాంకేతిక నిపుణులకు ఆ మొత్తాన్ని బదిలీ చేసినట్లు కూడా శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

సినిమాలు ప్రకటిస్తున్నారు కానీ
బెల్లంకొండ సురేష్ , ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెల్లంకొండ శ్రీనివాస్ గోపీచంద్ మలినేని మరియు కోన వెంకట్‌లతో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసాడు, కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో, తండ్రీ కొడుకులు అందరికీ అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చారు, కానీ శరణ్ కుమార్‌కి ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యారు. విషయం జరిగి ఏళ్ళు గడుస్తున్నా వేరే సినిమాలు ప్రకటిస్తున్నారు కానీ తనతో సినిమా చేయడానికి కానీ డబ్బు వెనక్కు ఇవ్వడానికి కానీ ఆసక్తి చూపకపోవడంతో శరణ్ కుమార్ పోలీసు ఫిర్యాదు చేశారు.

హౌరా బ్రిడ్జ్ చిత్రాన్ని
హౌరా బ్రిడ్జ్ చిత్రాన్ని నిర్మించిన శరణ్ కుమార్ బెల్లంకొండ సురేష్ , బెల్లంకొండ శ్రీనివాస్ లు సినిమా నిర్మాణం కోసం డబ్బులు అవసరమని 2018 లో మొదట 50 లక్షలు అప్పుగా తీసుకున్నారని పేర్కొన్నారు. తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా అంటూ నమ్మించి మళ్ళీ డబ్బు తీసుకున్నారని అంటున్నారు. అలా ఆ తర్వాత సినిమాలో నిర్మాణ భాగస్వామిగా చేస్తామని చెబుతూ మొత్తం 85 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు చెబుతున్నారు.
Recommended Video

‘ఛత్రపతి' రీమేక్
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల విషయానికొస్తే చివరిగా ‘అల్లుడు అదుర్స్' సినిమాతో పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. ప్రస్తుతం హిందీలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి' సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. వి.వి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ భారీ ఎత్తున తెరకెక్కిస్తోంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.