For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘యాత్ర’లో వైఎస్ జగన్ తాత రాజారెడ్డిగా జగపతి బాబు... ఫస్ట్ లుక్ అదిరిపోయింది!

  |
  Jagapathi Babu As YS Raja Reddy In Yatra movie First Look Released | Filmibeat Telugu

  దివంగత నేత వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర'. వైఎస్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారాన్ని 'యాత్ర' రూపంలో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్, లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

  తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో 'యాత్ర' ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ఇతర పాత్రల లుక్ విడుదల చేస్తూ ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా జగపతిబాబుకు సంబంధించిన లుక్ విడుదలైంది.

  వైఎస్ జగన్ తాత రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు

  వైఎస్ జగన్ తాత రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు

  ఈ చిత్రంలో వైఎస్ రాజారెడ్డి పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. ‘యాత్ర'లో ఆయన లుక్ ఎలా ఉండబోతోందో రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. జగపతి బాబు లుక్ చూస్తుంటే అచ్చం రాజారెడ్డిని చూసినట్లే ఉంది అంటున్నారు అభిమానులు.

  మహి వి రాఘవన్

  మహి వి రాఘవన్

  ‘ఆనందో బ్రహ్మ వంటి' సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మ‌హి వి రాఘ‌వ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది.

  పాదయాత్ర ప్రధానంగా

  పాదయాత్ర ప్రధానంగా

  దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద యాత్ర చేశార‌నే విష‌యం మాత్ర‌మే తెలుగు ప్ర‌జ‌ల‌కి తెలుసు కాని ఆ పాద‌యాత్ర త‌న రాజ‌కీయ యాత్ర‌లో ఎంత కీల‌క‌మనే విషయం కొంత‌మందికే తెలుసు. అప్ప‌టి రాజ‌కీయ అనిశ్చితి దృష్ట్యా ఆయ‌న ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌ర‌గా వెళ్ళి వారి స‌మ‌స్య‌లు తెలుసుకొవ‌టానికి ఈ యాత్ర మెద‌లుపెట్టారు. ఈ విషయాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ‘యాత్ర' చిత్రం సాగుతుంది.

  తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్పకుండా చూడ‌వ‌ల‌సిన చిత్రం

  తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్పకుండా చూడ‌వ‌ల‌సిన చిత్రం

  ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ... మ‌డ‌మ‌తిప్ప‌ని నాయకుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి పాత్ర‌లో మమ్ము‌ట్టి గారు న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్పకుండా చూడ‌వ‌ల‌సిన చిత్రం. వైఎస్ఆర్ పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.

  నటీ నటులు

  నటీ నటులు

  మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి.....తదితరులు

  సాంకేతిక వర్గం

  సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్
  మ్యూజిక్ - కె ( క్రిష్ణ కుమార్ )
  ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
  సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
  ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని
  సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్
  సమర్పణ - శివ మేక
  బ్యానర్ - 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
  నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
  స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్

  English summary
  Jagapathi Babu As YS Raja Reddy in Yatra movie First Look Released. Yatra is a biographical film about Y. S. Rajasekhara Reddy, who served as Chief Minister of Andhra Pradesh from 2004 to 2009. The film is written and directed by Mahi V. Raghav and stars Mammootty as YSR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X