Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అధర్వగా దుమ్ము రేపిన ధోని.. సిక్సులే కాదు.. కత్తులతో నెత్తురు కూడా!
భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కు దూరమై ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. అదేంటి అనుకుంటున్నారా? అదే అధర్వ అవతారం. అసలు ఏంటీ అథర్వ అవతారం? ఆయన అధర్వ గా మారడం ఏమిటి? అనుకుంటున్నారా? అయితే మీరు ఏ విషయం తెలుసుకోవాల్సిందే. అసలు విషయం ఏమిటంటే సంగీత దర్శకుడు రమేష్ తమిళ్‌మణి రచిస్తున్న గ్రాఫిక్ నవల 'అధర్వ: ది ఆరిజిన్'లో ధోని హీరో పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇది సినిమా మాత్రం కాదండోయ్ కేవలం గ్రాఫిక్ నవల మాత్రమే. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా తాజాగా ధోనీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేశారు. ఇక మోషన్ పోస్టర్‌ను బట్టి ఇది పీరియాడిక్ గ్రాఫిక్ నవల అని చెప్పచ్చు. అయితే ఇప్పటి దాకా క్రికెటర్ గా మాత్రమే జనానికి అలవాటైన ధోనిని.. ఇప్పుడు కత్తి పట్టుకుని తలలు నరుకుతుంటే చూడటం మాత్రం కొంచెం కొత్తగానే ఉంది.
ఈ గ్రాఫిక్ నవల త్వరలో అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ప్రీ-ఆర్డర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని వీడియో చివర్లో ప్రకటించారు. విర్జూ స్టూడియోస్ మిడాస్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి వారి రాబోయే మెగా బడ్జెట్ గ్రాఫిక్ నవల 'అథర్వ - ది ఆరిజిన్' మోషన్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ గురించి MS ధోని మాట్లాడుతూ 'ఈ ప్రాజెక్ట్‌తో అనుసంధానం అయినందుకు నేను చాలా థ్రిల్‌గా ఉన్నాను మరియు ఇది నిజంగా అద్భుతమైన వెంచర్. 'అథర్వ - ది ఆరిజిన్' అనేది ఆకర్షణీయమైన కథ మరియు లీనమయ్యే కళాకృతితో ఆకర్షణీయమైన గ్రాఫిక్ నవల అని పేర్కొన్నారు.

భారతదేశపు మొట్టమొదటి పౌరాణిక సూపర్‌హీరోను పరిచయం చేసేందుకు రచయిత రమేష్ తమిళ్ మణి చేసిన ప్రయత్నం ప్రతి పాఠకుడికి దగ్గర అవుతుంది అని అన్నారు. రచయిత రమేష్ తమిళ మణి మాట్లాడుతూ.. 'అథర్వ-ది ఆరిజిన్ డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది నా మనసుకు దగ్గరైంది. ఒక దార్శనికతను, ఒక ఆలోచనను జీవం పోసి దానిని ఒక కళాఖండంగా మార్చడానికి మేము చాలా సంవత్సరాలు కృషి చేసాము. ఎంఎస్ ధోని అథర్వ పాత్రను పోషించడం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. MS ధోనితో సహా నవలలోని ప్రతి పాత్ర మరియు కళాకృతి విస్తృతమైన పరిశోధన తర్వాత అభివృద్ధి చేయబడింది మరియు ప్రపంచంలోని అనేక వివరాలు జాగ్రత్తగా రూపొందించబడ్డాయని అన్నారు.