Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Balakrishna NBK108 నుంచి క్రేజీ అప్డేట్.. కేక్ కట్ చేసి మరి తెలిపిన సినిమా యూనిట్!
నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'అఖండ' తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు. ఈ ఊపులోనే ఆయన కొత్త సినిమాలను వరుసగా లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఓ వైపు అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా అదరగొడుతూనే మరోవైపు సినిమాల్లో జోరు చూపిస్తున్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. దీంతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108వ సినిమాను చేస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్.

అఖండ తర్వాత స్పీడ్..
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. గత ఏడాది విడుదలైన 'అఖండ' వంటి సూపర్ సక్సెస్ తర్వాత మరింత స్పీడు పెంచారు. ఇందులో భాగంగానే ఇప్పుడు గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. షైన్ స్క్రీన్ సంస్ధ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కోసం భారీగా జైలు సెట్ వేశారు. ఈ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ సన్నివేశాలకు వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా NBK108 (వర్కింగ్ టైటిల్) సెట్స్ లో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది ఈ మూవీ టీమ్.

విలన్ గా హీరోయిన్ అంజలి..
ఇదిలా ఉండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా చేయగా బాలకృష్ణకు కూతురిగా శ్రీలీలా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. అలాగే మరో హీరోయిన్ బ్యూటిఫుల్ అంజలి ఇందులో విలన్ గా నటిస్తోందని మరో న్యూస్ వినిపిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.