For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను ఇంకా చనిపోలేదు.. అలా చెప్పినందుకు సంతోషంగా ఉందంటూ షకీలా

  |

  బి గ్రేడ్ యాక్టర్ షకీలా అంటే ఒకప్పుడు అడల్ట్ సినిమాల ప్రపంచంలో స్టార్ హీరోయిన్. అలాంటి సినిమాలతో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని చూసిన ఆమె అనంతరం ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చిందో అందరికి తెలిసిందే. ఇక చాలా రోజుల అనంతరం ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఆమెను వెంటాడుతున్నట్లు ఆ మధ్య ఒక వివరణ ఇచ్చింది. అయితే ఆమె చెప్పిన దానికంటే రూమర్స్ డోస్ మరింత ఎక్కువవ్వడంతో వివరణ ఇవ్వక తప్పలేదు.

  Shakeela విషయంలో ఇది జరిగి ఉంటే గొప్ప నటి అయ్యేది ! || Filmibeat Telugu
  తనను బ్రతికించాలని

  తనను బ్రతికించాలని


  షకీలా ఆ మధ్య కొన్ని సినిమాలను నిర్మించి అభిమానులను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసింది. హాస్పిటల్ నుంచే డైరెక్ట్ గా ఆరోగ్య సమస్య గురించి చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియో అందరిని షాక్ కు గురి చేసింది. ఓటీటీలో సినిమాను విడుదల చేస్తున్నట్లు వీహెబుతు.. ఆ సినిమాను చూసి తనను బ్రతికించాలని చెప్పడంతో ఓ వర్గం వారు ఆమెకు సపోర్ట్ చేశారు.

  ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే స్టార్ నటిగా

  ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే స్టార్ నటిగా

  బి గ్రేడ్ సినిమాలతో కూడా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఏకైక నటి షకీలా. అప్పట్లో మలయాళంలో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే ఆమె స్టార్ నటిగా క్రేజ్ ను అందుకుంది. అయితే కాలం ఎప్పటికి ఒకేలా ఉండదు అని షకీలా జీవితం మరో ఉదాహరణగా నిలిచింది. నమ్మిన వాళ్ళే ఆమెను మోసం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పి షకీలా ఎమోషనల్ అయ్యింది.

  చేసిన అప్పుల నుంచి బయటపడాలని

  చేసిన అప్పుల నుంచి బయటపడాలని

  ఇక ఆర్థిక నష్టాలతో చాలా రోజులు ఇబ్బంది పడిన షకీలా ఆ మధ్య మళ్ళీ కోలుకునేందుకి ఒక సినిమాను నిర్మించారు. లాక్ డౌన్ కారణంగా ఆ అడల్ట్ సినిమా వాయిదా పడింది. ఇక అప్పుల నుంచి బయటపడాలని ఆమె డిజిటల్ వరల్డ్ లో సినిమాను రిలీజ్ చేసింది. సినిమా ఆన్ లైన్ లోనే కొనుక్కొని చూసేలా వెబ్ సైట్ లో విడుదల చేసింది.

  అయ్యో షకీలా చనిపోయిందా?

  అయ్యో షకీలా చనిపోయిందా?

  ఇక షకీలా ఆరోగ్యంపై చాలా రోజులుగా కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఆరోగ్య ఏ మాత్రం బాగోలేదని అంటూ యూ ట్యూబ్ లో ఫేస్ బుక్ లో కొన్ని కథనాలు వచ్చాయి. కొందరైతే ఆమె ప్రాణాలతో లేదని కూడా పోస్ట్ చేశారు. నిజమని అనుకున్న కొందరు నెటిజన్లు అయ్యో షకీలా చనిపోయిందా అని సంతాపం కూడా తెలియజేయడం షాక్ కు గురి చేసింది.

  కంగారు పడకండి

  కంగారు పడకండి

  ఇక ఆ తప్పుడు వార్తలపై షకీలా స్పందించక తప్పలేదు. ఇలాంటి వార్తలు ఎవరు నమ్మవద్దు. నేను క్షేమంగానే ఉన్నాను. చనిపోయినట్లు కొందరు కామెంట్స్ పెడుతున్నారు. కంగారు పడకండి నేను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ తప్పుడు వార్తల కారణంగా మా బందువులు మిత్రులు కంగారు పడుతున్నారు.. అను షకీలా తెలిపింది.

  ఆనందంగా ఉంది

  ఆనందంగా ఉంది

  ఒక విధంగా అసత్య వార్తలు క్రియేట్ చేసిన వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి వార్తలు రావడం వలన వారు అందరూ కూడా నా వైపు ఉన్నారని ఆనందంగా ఉంది. అంటూ షకీలా చాలా పాజిటివ్ గా స్పందించారు. దీంతో అభిమానులు కూడా ఆమె ఆనందంగా ఉండాలని పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  Shakila is an actress who once broke box office records with B grade movies. Needless to say, the level of craze she received in Malayalam was special. She produced a film long after she had slowly lost financially for a number of reasons. However the movie was postponed due to lockdown. Unable to escape the losses she is releasing the film in the digital world.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X