Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కోన వెంకట్‌పై చీటింగ్ కేసు.. ఫిర్యాదు ఏమిటంటే..
సినీ రచయిత, దర్శకుడు, మాటల రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు నమోదైంది. సినిమాకు సంబంధించి తీసుకొన్న అడ్వాన్స్ ఇవ్వడం లేదనే అంశంపై ఆయనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని మోతీ నగర్‌కు చెందిన ఆర్వీఆర్వీ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. జెమిని ఎఫ్ఎక్స్, జేడీఏ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ప్రసాద్ సినిమా కథ కోసం 2017లో రచయిత కోన వెంకట్‌తో కలిశారు. సినిమా చర్చల్లో భాగంగా కథను ఇస్తానని హామీ ఇవ్వడంతో వారి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా అడ్వాన్సుగా రూ.15 లక్షల రూపాయలు రెమ్యునరేషన్‌గా ఇవ్వాలని అడిగితే.. పన్ను మొత్తం కింద కొంత తగ్గించి రూ.13.5 లక్షలు చెక్కు రూపంలో ఇచ్చారు. వాటిని వెంటనే కోన విత్ డ్రా కూడా చేసుకోవడం జరిగింది.
ఆ తర్వాత కథ ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. ఓ సారి ఫోన్‌లో దుర్బాషలాడారు అనే విషయాన్ని ప్రసాద్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇక పలుమార్లు మధ్యవర్తులు సంప్రదించగా.. అమెరికాలో ఉన్నానని చెప్పి తప్పించుకోవడం జరిగిందనేది సీనీ వర్గాల సమాచారం. డబ్బు వెనుకకు తిరిగి ఇచ్చే విషయంలో పలుమార్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపినా లాభం లేకపోయింది. దాంతో శనివారం బంజారా హిల్స్ పోలీసులకు ప్రసాద్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
కాగా, ప్రస్తుతం అమెరికాలో నిశ్శబ్దం అనే చిత్రం షూటింగ్‌తో కోన వెంకట్ బిజీగా ఉన్నారు. ఆ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో అనుష్క మూగ పెయింటర్‌గా కనిపించబోతున్నది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆర్ మాధవన్, షాలిని పాండే, శ్రీనివాస అవసరాల, సుబ్బరాజు, హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్సన్ తదితరులు నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.