For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NBK107: బాలయ్య విలన్‌కు శుభాకాంక్షల వెల్లువ.. స్పెషల్ పిక్ షేర్ చేసిన డైరెక్టర్

  |

  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. భారీ అంచనాలతో యాభై రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో పాటు కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టింది. ఫలితంగా అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు, ఏకంగా 103 సెంటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర విజయంతో బాలయ్య ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

  హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

  'అఖండ' మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. మాస్ హీరో రవితేజతో 'క్రాక్' మూవీ చేసి భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ దర్శకుడు.. ఆ వెంటనే బాలయ్య కోసం మరో పవర్‌ఫుల్ అండ్ రియలిస్టిక్ స్టోరీని రాసుకున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తైంది.

  Gopichand Malineni Special Wishes to Duniya Vijay

  బాలయ్య కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను ఢీ కొట్టబోయే విలన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది నటుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇటీవలే దీనిపై అప్‌డేట్ ఇచ్చేసింది. ఈ మూవీలో కన్నడ సీనియర్ అండ్ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అతడికి స్వాగతం పలుకుతూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అయితే, ఇందులో అతడు ఓ పవర్‌ఫుల్ రోల్‌ను చేస్తున్నట్లు మాత్రమే చెప్పారు. అయినప్పటికీ ఇది విలన్ రోల్ అని అనుకుంటున్నారంతా.

  సుడిగాలి సుధీర్‌పై లేడీ ఆర్టిస్ట్ వివాదాస్పద కామెంట్స్: బేవార్స్ అంటూ అతి దారుణంగా!

  కన్నడంలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న దునియా విజయ్.. అక్కడ తనదైన చిత్రాలతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకున్నారు. ఇక, ఇప్పుడు బాలయ్య చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 20) ఆయన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని విజయ్‌తో దిగిన ఫొటోను షేర్ చేసి మరీ విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.

  బాలయ్య సినిమాలో దునియా విజయ్ ఎంతో స్టైలిష్ గెటప్‌తో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆయన రోల్ కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రంలో హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రను చేస్తోంది. ఈ సినిమాను జనవరి చివరి వారం నుంచి పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.

  English summary
  Nandamuri Balakrishna Will Do a Film with Gopichand Malineni. Duniya Vijay to play Key Role in This Movie. Now Gopichand Special Wishes to Duniya Vijay.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion