For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేవుడు, దెయ్యం నిజమా? అబద్దమా? వినూత్న కథతో GST.. వేడుకగా పోస్టర్ ఆవిష్కరణ!

  |

  విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిన్న చిత్రాలు భారీగా ప్రేక్షకుల స్పందనను అందుకొంటున్నాయి. లాక్‌డౌన్‌లో కూడా ఓటీటీలో రిలీజైన కొత్త నటీనటుల చిత్రాల మంచి విజయాలను అందుకొన్నాయి. ఈ క్రమంలో తోలుబొమ్మ‌ల సిత్రాలు బ్యాన‌ర్‌పై కొమారి జాన‌కిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో కొమారి జాన‌య్య‌నాయుడు నిర్మిస్తున్న చిత్రం జిఎస్‌టి (God Saithan Technology). ఈ చిత్ర లోగో పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ సినీజోష్ ఆఫీస్‌లో ఆవిష్కరించారు.

  ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు జాన‌కిరామ్ మాట్లాడారు... తోలు బొమ్మ‌ల సిత్రాలు బ్యాన‌ర్ పై ఈ చిత్రం లోగోను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది అన్నారు. దర్శకుడిగా GST నా మొద‌టి చిత్రం. ఎప్పటి నుంచి నా మ‌దిలో మెలుగుతున్న ఆలోచ‌నే ఈ చిత్ర కథ. దేవుడు, దెయ్యం, సైన్స్ లాంటి అంశాలపై పరిశోధనకు పరిష్కారం లభించడం లేదు. ఏది నిజం ఏది అబద్ధం అని నా మ‌దిలో మెదిలే ప్ర‌శ్న ఇది. ఆ కోవ‌లోనే ఎన్నో దేవాల‌యాలు, ఎన్నో స్మ‌శానాలు అలాగే ఎంతో టెక్నాల‌జీ గురించి రీసెర్చ్ చేసి చేసిన చిత్ర‌మిది. ప్ర‌స్తుతం క‌రోనా వ‌చ్చింది. ప్ర‌తిదానికి ఏదో ఒక వ్యాక్సిన్ క‌నుక్కున్నారు. కానీ ఈ స‌మ‌స్య‌కు మాత్రం వాక్సిన్ అనేది లేదు. దేవుడు వ‌ర్సెస్ సైతాన్ ఇందులో ఏముంది అని రీసెర్చ్ చేసి అందులోంచి క‌థ‌ను రెడీ చేసుకున్నాను అని అన్నారు.

   GST: God Saithan Technology Logo poster unveiled

  జూనియ‌ర్ సంపు అమ‌ర్‌నాధ్ మాట్లాడుతూ... దేవుడు, దెయ్యం, సైన్స్ ఫిక్ష‌న్‌కి సంబంధించిన ఎన్నో చిత్రాలు వ‌చ్చాయి. కానీ ఇది కొత్త కాన్సెప్ట్ చిత్రం. అన్ని హంగులు క‌ల‌గ‌లిపిన చిత్ర‌మే జిఎస్‌టి జ‌రిగిన‌దాన్ని చూపించ‌డం ఇతిహాసం అంటారు. ఈ చిత్రంలో చాలా రిస్కీ షాట్స్ ఎక్కువ‌గా ఉన్నాయి అని అన్నారు.

  పూజా హీరోయిన్ మాట్లాడుతూ... ఇందులో నా పాత్ర తెలంగాణ యాస్ మాట్లాడే అమ్మాయి పాత్రను పోషించాను. డైరెక్ట‌ర్‌ చాలా కూల్ మైండ్‌తో ప‌నిచేసేవారు. సైన్స్‌లో ఇప్పటి తెలియ‌ని కొత్త విష‌యాలు తెలుస్తాయి. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. హీరోయిన్ ఇందు మాట్లాడుతూ... క‌థ‌ని మాకు డైరెక్ట‌ర్‌గారు ఎలాగైతే చెప్పారో తియ్య‌డం కూడా అలానే తీశారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. క‌రోనా వ‌ల్ల ఈ చిత్రం రావ‌డం లేట్ అయింది అని అన్నారు.

   GST: God Saithan Technology Logo poster unveiled

  హీరోయిన్ స్వాతి మండ‌ల్ మాట్లాడుతూ... డైరెక్ట‌ర్ ప్ర‌తి ఒక్క‌రినీ చ‌క్క‌గా కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళేవారు. ఈ క‌థ ఒక యూనిక్ స్టోరీ. ఈ చిత్రంలో మ‌సాలా, యాక్ష‌న్‌, రొమాన్స్ అన్నీ ఉంటాయి అన్నారు.

  హీరో అశోక్ మాట్లాడుతూ... సినిమా మొత్తానికి క‌థే హీరో. ఇందులో హీరో, విల‌న్‌, హీరోయిన్ అలా పాత్ర‌ల‌కంటే క‌థే మెయిన్ పాత్ర పోషిస్తుంది. ద‌ర్శ‌కులు జాన‌కిరామ్‌ లాంటి వారు ఇండ‌స్ట్రీలో ఉండ‌డం వ‌ల్ల కొత్త వాళ్ళ‌కు అవ‌కాశాలు దొరుకుతాయి. ఆయ‌న‌తో క‌లిసి ఇంకా భ‌విష్య‌త్తులో సొంతంగా సినిమాలు నిర్మించి చేయాల‌నుంది అన్నారు.

  నటీనటులు
  ఆనంద్‌కృష్ణ‌, అశోక్‌, స్వాతి మండ‌ల్‌, యాంక‌ర్ ఇందు, పూజ‌సుహాసిని, శ‌ష్టివ‌ర్మ‌, జూనియ‌ర్ సంపు, వెంక‌ట్‌, నందు, వాణి, గోవింద్‌, స్వ‌ప్న‌, వేదం నాగ‌య్య‌, జాన‌ప‌దం అశోక్‌, న‌ల్ల‌సుద‌ర్శ‌న‌రావ్‌ తదితరులు

  టెక్నీషియ‌న్స్
  మ్యూజిక్: యువీ నిరంజ‌న్‌,
  డివోపీ: డి.యాద‌గిరి,
  ఎడిటింగ్: సునీల్‌ మ‌హ‌రానా,
  నిర్మాత: కోమారి జాన‌య్య నాయుడు,
  కో-డైరెక్ట‌ర్: రాజ్ కిషోర్ సీర‌మ్‌,
  క‌థ స్క్రీన్‌ప్లే, మాట‌లు ద‌ర్శ‌క‌త్వం: కోమారి జాన‌కిరామ్‌,

  English summary
  GST ie., God Saithan Technology logo poster unveiled in hyderabad. Produced by Janaiah Naidu, Directed by Komari Janaki Ram. This film is science based concept. Up coming actor, Actress ar potraying the lead roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X