For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nagarjuna The Ghost: మరోసారి డాన్ స్టైల్ లో భయపెడుతున్న కింగ్ నాగార్జున

  |

  కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల మన్మధుడు 2, ఆఫీసర్, వైల్డ్ డాగ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేదనే చెప్పాలి. దీంతో మార్కెట్ తగ్గుతుండడం వలన కొంత ఆలోచన చేసిన నాగార్జున తన తదుపరి ప్రాజక్ట్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నాడు.

  ప్రస్తుతం ఇద్దరు యువ దర్శకులకు ఛాన్స్ ఇచ్చారు. వారిలో ప్రవీణ్ సత్తారు తో నాగార్జున చేస్తున్న న్యూ మూవీ చాలా డిఫరెంట్ గా తెరకెక్కనోతున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ది ఘోస్ట్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా మొదటి పోస్టర్ తోనే మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది.

  ది ఘోస్ట్ ఫస్ట్ లుక్

  ది ఘోస్ట్ ఫస్ట్ లుక్

  నాగార్జున అలానే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే సినిమా కూడా చేస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు మూవీ ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభము కాగా, ప్రవీణ్ సత్తారు మూవీ కొన్ని వారాల క్రితం సెట్స్ పైకి వచ్చింది. ది ఘోస్ట్ అనే టైటిల్ తో పాటు నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు నాగార్జున జన్మదినం సందర్భంగా విడుదల చేశారు.

  డాన్ తరహాలో వైల్డ్ గా..

  డాన్ తరహాలో వైల్డ్ గా..

  గతంలో లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున నటించిన డాన్ మూవి స్టైల్ లో ఫుల్ జర్కిన్ తో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో నాగార్జున ఎంతో వైల్డ్ లుక్ లో కనపడుతున్నారు. అయితే ఈ పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇది మంచి యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ అని మనకు కొంత అర్ధం అవుతోంది. గతంలో గరుడవేగా వంటి సక్సెస్ ఫుల్ థ్రిల్లింగ్ మూవీ తీసిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని అంతకుమించి అనేలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

  మొదటిసారి కాజల్ తో యాక్షన్ మూవీ

  మొదటిసారి కాజల్ తో యాక్షన్ మూవీ

  నాగార్జున కి జోడీగా ఫస్ట్ టైం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కబోయే ది ఘోస్ట్ సినిమాను ఏషియన్ సినిమాస్ సునీల్, శరత్ మరార్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అలానే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై నిర్మిస్తున్నారు.

  నాగార్జున పాత్ర అదేనా?

  నాగార్జున పాత్ర అదేనా?

  ఇక ఈ సినిమాలో నాగార్జున ఒక అండర్ కవర్ ఏజెంట్ గా కనపడనుండగా అయన టీమ్ లో కీలక ఆఫీసర్ గా కాజల్ అగర్వాల్ కూడా దర్శనమివ్వనున్నట్లు సమాచారం. అయితే సినిమాలో ఆమె క్యారెక్టర్ కొంత నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా నేడు విడుదలైన ది ఘోస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి నాగ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుడి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

  Bigg Boss-5 టైం విషయంలో షాకిచ్చిన స్టార్ మా.. నేటి నుంచి క్వారంటైన్ లో...!! || Filmibeat Telugu
  రిలీజ్ ఎప్పుడంటే..?

  రిలీజ్ ఎప్పుడంటే..?

  తొలిసారిగా నాగార్జున వంటి పెద్ద హీరోతో సినిమా చేస్తుండడంతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమా స్క్రిప్ట్, కథ, కథనాలపై ఎంతో పక్కాగా శ్రద్ధ తీసుకుని తెరకెక్కిస్తున్నారు. తప్పకుండా విడుదల తరువాత ఈ మూవీ భారీ స్థాయిలో సక్సెస్ అందుకోవడం ఖాయం అని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. మరి తొలిసారిగా నాగ్, కాజల్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

  English summary
  Happy birthday akkineni nagarjuna the ghost look viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X