twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవీ శ్రీ, నన్ను వదిలేయ్ అన్నాడు.. షాకింగ్ నిజం బయటపెట్టిన హరీష్ శంకర్

    |

    ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించారు డైరెక్టర్ హరీష్ శంకర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలు రాజుకున్నప్పటికీ, రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేస్తూ విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఎందుకు సంగీతం అందించలేదనే విషయమై గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించారు హరీష్ శంకర్. వివరాల్లోకి పోతే..

    దేవీ శ్రీ ప్రసాద్ అనుకున్నారు కానీ..

    దేవీ శ్రీ ప్రసాద్ అనుకున్నారు కానీ..

    దేవీ శ్రీ ప్రసాద్- హరీష్ శంకర్ అంటే సూపర్ హిట్ జోడీ. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గత చిత్రాలు గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం చిత్రాలకు బాణీలు కట్టి ఆయా సినిమాల విజయంలో భాగమయ్యాడు దేవీ శ్రీ. దీంతో 'గద్దలకొండ గణేష్' సినిమాకు కూడా దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడతారని అంతా భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ ప్రాజెక్టులో మిక్కీ జె మేయర్ భాగమయ్యారు.

     దేవీ శ్రీ ప్రసాద్- హరీష్ శంకర్ మధ్య మనస్పర్థలు

    దేవీ శ్రీ ప్రసాద్- హరీష్ శంకర్ మధ్య మనస్పర్థలు

    దేవీ శ్రీ ప్రసాద్- హరీష్ శంకర్ మధ్య మనస్పర్థలు వచ్చాయని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అందుకే గద్దలకొండ గణేష్ సినిమాలో ఈ ఇద్దరూ భాగం కాలేదని వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ ఇష్యూ గురించి నోరువిప్పారు హరీష్ శంకర్.

    రీమిక్స్ సాంగ్.. అసలు కారణం అదే

    రీమిక్స్ సాంగ్.. అసలు కారణం అదే

    గద్దలకొండ గణేష్ సినిమాలో ''ఎల్లువొచ్చి గోదారమ్మ'' రీమిక్స్ సాంగ్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కారణం గానే దేవీ శ్రీ ప్రసాద్ గద్దలకొండ గణేష్ సినిమా కదులుకోవాల్సి వచ్చిందని హరీష్ పేర్కొన్నారు. సాధారణంగా దేవీ శ్రీ రీమిక్స్ సాంగ్స్ చేయడం ఇష్టపడరు. అయినప్పటికీ తాను గద్దలకొండ గణేష్ సినిమాకు మ్యూజిక్ అందించమని దేవీ శ్రీని కోరానని, కానీ ఆయన నన్ను వదిలేయ్ అనడంతో మిక్కీ జె మేయర్‌ని తీసుకున్నామని చెప్పారు.

    ఇష్యూకి ఫుల్‌స్టాప్

    గద్దలకొండ గణేష్ సినిమా చాలా ఫ్రెండ్లీగా దేవీ శ్రీ తన తిరస్కారం చెప్పారని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పారు హరీష్. దేవీ శ్రీ ప్రసాద్ తో అతి త్వరలో మరో సినిమా చేస్తానని అన్నారు హరీష్ శంకర్. దీంతో ఈ ఇష్యూకి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.

    దేవీ శ్రీ ప్రసాద్ రియాక్షన్

    దేవీ శ్రీ ప్రసాద్ రియాక్షన్

    హరీష్ శంకర్ మాట్లాడిన ఈ వీడియో, ఆయన చెప్పిన విధానం చూసి వెంటనే రియాక్ట్ అయ్యారు దేవీ శ్రీ ప్రసాద్. ట్విట్టర్ వేదికగా ఆ వీడియో పోస్ట్ చేస్తూ మంచి క్లారిఫికేషన్ ఇచ్చారని, హాట్సాఫ్.. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

    English summary
    Varun Tej' Valmiki movie title changed as Gaddalakonda Ganesh. Now this movie released world wide. The audians who seen this movie responded possitively. Harish Shankar gave Clarity On this movie music director issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X