ఆ హీరో పిలిచినప్పుడల్లా మంచం ఎక్కాల్సిందే.. సీఎం ముందే సజీవదహనానికి నటి యత్నం

చిత్ర పరిశ్రమలో వెలిగిపోవాలని వచ్చే అందమైన అమ్మాయిలను అవకాశాల పేరుతో ట్రాప్ చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ రక్కసి గురించి రోజుకొక వార్త వెలుగులోకి వస్తోంది. నిత్యం ఎవరో ఒక నటి.. తమకు జరిగిన అన్యాయంతో పాటు చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఓ హీరోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ నటి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందే ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

హర్యాన్వీ సూపర్‌స్టార్‌గా
హర్యాన్వీ చిత్ర పరిశ్రమలో ఉత్తర్ కుమార్ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. 2004లో ధకడ్ చోరా సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత హీరోగా రాణిస్తూనే దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు సేవలందించారు. 52 ఏళ్ల ఉత్తర్ కుమార్‌కు రాజమాలా చౌదరితో పెళ్లవ్వగా.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ఆయనపై ఈ ఏడాది జూలైలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది.

Haryanvi Actor Uttar Kumar arrested in false promise of marriage case

పెళ్లి చేసుకుంటానని మోసం
సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు గౌతమ బుద్ధ నగర్‌కు చెందిన బాధితురాలు ఆరోపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన 2020లో రజ్జీ బోల్జా అనే సూపర్‌హిట్ సాంగ్‌తో సదరు నటి పాపులర్ అయ్యారు. ఈ షూటింగ్ సమయంలో ఉత్తర్‌తో తనకు పరిచయం అయినట్లు ఆమె తెలిపింది. ఉత్తర్ కుమార్ చాలాకాలంగా మాయమాటలు చెబుతూ తనను తప్పుదారి పట్టించాడని బాధితురాలు ఆరోపించారు. ఉత్తర్‌తో ఐదేళ్ల పాటు పనిచేశానని.. ఆ సమయంలో సినిమాలలో అవకాశం వస్తుందని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని చెప్పింది. అతని మాటలపై నమ్మకంతో ఉత్తర్‌తో తాను శారీరకంగా కలిశానని.. కానీ ఆయన తనను పెళ్లి చేసుకోలేదని ఘజియాబాద్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమె ఆరోపించింది.

హీరో ట్రాప్‌లో అమ్మాయిలు
ఉత్తర్ కుమార్ తనను ఫాంహౌస్‌కి.. అతని ప్రైవేట్ కార్యాలయానికి తరచుగా పిలిపించుకుని లైంగిక వాంఛ తీర్చుకునేవాడని బాధితురాలు ఆరోపించింది. అతని వేధింపులు భరించలేక తాను మరోచోట పనిచేస్తానని చెప్పినా ఒప్పుకోలేదని, అతని ట్రాప్‌లో తనతో పాటు ఎందరో అమ్మాయిలు పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్ కుమార్‌పై తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని, రాజీ చేసుకోవాలని లేదంటే చంపేస్తామని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాధితురాలు బాంబు పేల్చింది. తమ రిలేషన్, ఎఫైర్‌పై సైలెంట్‌గా ఉండాలని.. ఎక్కడా నోరు జారొద్దని ఉత్తర్ కుమార్ నాకు డబ్బులు కూడా ఇచ్చాడని ఆరోపించింది.

పోలీసుల ఉదాసీనత
ఈ వ్యవహారంపై ఫిర్యాదు దాఖలు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సదరు నటి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆమె ఫిర్యాదు చేసిన 25 రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా ఉత్తర్ కుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హీరో ఉన్న లోకేషన్ గురించి తాను పోలీసులకు పలుమార్లు తెలియజేశానని, అయినప్పటికీ వారి నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం
ఉత్తర్ కుమార్ తనను మోసం చేశాడు అనడానికి నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయని.. చాట్స్, కాల్ డేట్, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయని సదరు మహిళ చెబుతున్నారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ సెప్టెంబర్ 6వ తేదీన లక్నోలోని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం ముందు బాధితురాలు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఉత్తర్ కుమార్‌ కోసం వేట సాగించిన పోలీసులు.. ఈ తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో అమ్రోహాలోని అతని ఫామ్‌హౌస్‌పై దాడి చేసి అరెస్ట్ చేశారు. అనంతరం ఉత్తర్ కుమార్‌ను ఘజియాబాద్‌కు తరలించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X