HBD Sai Dhansika ’మంత్ర, మంగళ రేంజ్‌లో దక్షిణ.. తులసీరామ్ మళ్లీ ట్రెండ్ సెట్ చేస్తారు’
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంలో వైవిధ్యమైన పాత్రతో ఆకట్టుకొన్న యువ నటి సాయి ధన్సిక కీలక పాత్రలో నటిస్తున్న దక్షిణ. హీరోయిన్ ఓరియెంటెడ్ నేపథ్యంగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఛార్మీ కౌర్ హీరోయిన్‌గా మంత్ర, మంగళ చిత్రాలకు ఓషో తులసిరామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కల్ట్ కాన్సెప్ట్ బ్యానర్‌పై నిర్మాత అశోక్ షిండే దక్షిణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ నటి సాయి ధన్సిక పుట్టిన రోజు అంటే నవంబర్ 20వ తేదీ సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.. భారీ స్పందన లభిస్తున్నది.
దక్షిణ మోషన్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ.. సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కాంబినేషన్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా హీరోయిన్ సాయి ధన్సిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవిడ పేరు చెబితే కబాలి మూవీ గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమెను 'దక్షిణ' ఫేమ్ ధన్సిక అంటారు. ఆవిడ రోల్ అంత పవర్ ఫుల్ గా ఉంటుంది అని అన్నారు.

దక్షిణ సినిమాకు కథ ఎంత హైలైట్ అవుతుందో... సాయి ధన్సిక పెర్ఫార్మెన్స్ కూడా అంతే హైలైట్ అవుతుంది. హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్‌తో సాయి ధన్సిక ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్రంలో బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్ రోల్ చేస్తున్నారు. ఇదొక సైకో థ్రిల్లర్. తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్నాం. ఇప్పటికే 70 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొన్నది. గోవా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. డిసెంబర్ నెలలో విశాఖలో జరిపే షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. తెలుగులో 'మంత్ర', 'మంగళ' ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాల తరహాలో 'దక్షిణ' ఉంటుంది'' అని చెప్పారు.

నటీనటులు: సాయి ధన్సిక, రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి తదితరులు
ఛాయాగ్రహణం: నర్సింగ్
సంగీతం: బాలాజీ
నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్
నిర్మాత: అశోక్ షిండే
దర్శకత్వం : ఓషో తులసీరామ్.


Click it and Unblock the Notifications











