For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA elections: కలకలం రేపుతున్న హేమ వాయిస్ మెసేజ్.. మనిషిని పంపిస్తా, అదొక్కటి చేయండి చాలంటూ!

  |

  అసలు ఎప్పుడు జరుగుతుందో తెలియని టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వార్త దీనికి సంబంధించి టాలీవుడ్ వర్గాల నుంచి బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న హేమ ఒక వాయిస్ మెసేజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లకు పంపినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

   ప్రకాష్ రాజ్ ఎంట్రీతో

  ప్రకాష్ రాజ్ ఎంట్రీతో

  టాలీవుడ్ నటీనటులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉన్న ఈ మధ్య కాలంలో ఆ సంప్రదాయాన్ని ఎవరూ పాటించడం లేదు దాదాపు ఎప్పుడూ రెండు వర్గాల పోటీలోకి దిగితే ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ప్రస్తుతం ఉన్న ప్యానల్ పదవీకాలం ఉండగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ప్రకాష్ రాజ్ ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి లేఖ రాయడంతో ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వ్యవహారానికి బీజం వేసినట్టు అయింది.

  మంచు విష్ణు ఏకగ్రీవ మంత్రం

  మంచు విష్ణు ఏకగ్రీవ మంత్రం

  ముందు తాను బరిలోకి దిగుతానని నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించగా ఆ తర్వాత హేమ కూడా తాను బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఇక వరుసగా మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటుడు సివీఎల్ వెంకట్రావు కూడా బరిలోకి దిగుతున్నారు అని ప్రకటించారు.. అలా దాదాపు అయిదుగురు బరిలో ఉన్నామని చెబుతున్నా ప్రధాన పోటీ మాత్రం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య లోనే ఉందని చెప్పవచ్చు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఎన్నికల అక్కర్లేదని ఏకగ్రీవం చేయాలని కోరుతూ మంచు విష్ణు ఒక వీడియో విడుదల చేయడమే కాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తన సొంత ఖర్చులతో కట్టిస్తాం అని కూడా హామీ ఇచ్చారు.

   తెగేదాక లాగవద్దు

  తెగేదాక లాగవద్దు

  ఇక రెండు మూడు రోజుల క్రితం ప్రకాష్ రాజ్ చేసిన ఒక ట్వీట్ కూడా సంచలనంగా మారింది. తెగేదాక లాగవద్దు అంటూ తెలుగులో ట్వీట్ చేసిన ఆయన మళ్లీ ఎన్నికలకు సంబంధించిన చర్చ మొదలయ్యేలా గా చేశారు. తాజాగా ఈ వ్యవహారం లోకి ఎంట్రీ ఇచ్చిన నటి హేమ మా ఎన్నికలు, మా అధ్యక్షుడు గురించి కామెంట్స్ చేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని చాలా మందికి వాయిస్ మెసేజ్ లు పంపినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. ప్రస్తుత పాలకవర్గం ఎన్నికలు జరగకుండా ఇదే పాలకవర్గం కంటిన్యూ ఎలాగా ప్లాన్ చేస్తున్నారని అలా కాకుండా ఎన్నికలు వెంటనే జరపాలని మా పెద్దలకు తాను లేఖ రాస్తున్నానని వెల్లడించారు.

  వాళ్ళు అలా ప్లాన్ చేస్తున్నారు

  వాళ్ళు అలా ప్లాన్ చేస్తున్నారు

  తాను 200 మంచి 250 మందికి ఈ లెటర్ పంపిస్తున్నాను అని, మా ఎలక్షన్స్ పెట్టకూడదు నరేష్ గారు ప్రెసిడెంట్ గా కొనసాగాలని అవతలి వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని తనకు తెలిసిందని ఆమె వాయిస్ నోట్లో పేర్కొన్నారు.. ఇప్పటివరకు మా అసోసియేషన్ ఒక రూపాయి సంపాదించింది లేదు కానీ నరేష్ గారు సంస్థకు ఉన్న ఐదు కోట్ల లో మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆమె వెల్లడించారు. ఇది వరకు ఆఫీస్ ఖర్చుల కోసం బయటనుంచి ఫండ్స్ రైజ్ చేసి తీసుకువచ్చి ఇచ్చే వాళ్ళని, ఇప్పుడు ఆయన కాలు కదపకుండా ఉన్న డబ్బుని ఖర్చు పెట్టేసి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ జరగకుండా ప్లాన్స్ వేస్తున్నారని తనకు తెలిసినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  మా ఉద్ద్దేశం అదే

  మా ఉద్ద్దేశం అదే

  అందుకే తాను ఒక్కొక్కరి దగ్గరకి తన మనిషిని ఇచ్చి పంపిస్తున్నాను అని మనకు ఎలక్షన్స్ కావాలి అని ఈ లెటర్ లో ఉంటుందని దాని మీద సంతకం చేసి పంపిస్తే లేఖలు అన్నీ తను మా అసోసియేషన్ కి సబ్మిట్ చేస్తానని వాయిస్ నోట్లో ఆమె పేర్కొన్నారు. ఆ లెటర్ లో ఉన్న మేటర్ తను చెప్పిన మేటర్ ఒకటేనని అందరూ ఎలక్షన్స్ కావాలని మాత్రం చెప్పండి అంటూ వాయిస్ మెసేజ్ లో ఆమె కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశం మీద హేమను ఒక మీడియా సంస్థ సంప్రదించగా ఆ వాయిస్ నోట్ నిజమేనని వెంటనే మా ఎన్నికలు జరిగి కొత్త కమిటీ ఏర్పడాలని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. తాము గతంలో ఎంతో కష్టపడి ఫండ్ రైజింగ్ చేస్తే ఆ డబ్బు అంతా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీ ఖర్చు పెట్టేస్తున్నారు అని, అది తనకు చాలా చాలా బాధగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇది ప్రకాష్ రాజ్ కోసమో లేక మంచు విష్ణు కోసం చేస్తున్న ప్రచారం కాదని పేర్కొన్నారు. ముందు ప్రస్తుతం ఉన్న కమిటీని దించడమే తమ ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. మొత్తం మీద మా ఎన్నికల వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చిందనే చెప్పాలి. ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో ఇంకా ఎంత చర్చ జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

  English summary
  It has come to light that actress Hema has sent a voice message to members of the Movie Artist Association. The topic is currently causing a stir in Tollywood circles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X