Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మహేష్ బాబుతో కలిసి బీర్ షేర్ చేసుకున్న హీరో.. షాకింగ్ విషయాన్ని చెప్పిన మేనల్లుడు
మహేష్ బాబు వెండితెరపై ఎంత స్టార్ ఇమేజ్ తో కనిపించినా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా కూల్ గా ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రం చాలా సరదాగా ఉంటాడు అనేది చాలా తక్కువమందికి తెలుసు. ఇక ఇటీవల మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ గురించి ఎవరికి తెలియని కోణాన్ని చెప్పాడు. మహేష్ బాబుకు ఒకసారి బీర్ తాగుతూ దొరికిపోయినట్లు కూడా చెప్పాడు.

చాలా కూల్ గా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక నటుడిగా ఎంత క్రమశిక్షణగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు చాలా కూల్ గా తన పని తాను చేసుకుంటూ వెళతారు. ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా సినిమాలు ఫ్యామిలీ లైఫ్ తో చాలా సింపుల్ గా హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

ఎన్నో మంచి పనులు
కేవలం సినిమాలు అని మాత్రమే కాకుండా తను సంపాదించిన దాంట్లో కొంత సామాజిక సేవకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తన సొంత గ్రామానికి కూడా కష్టం వచ్చిన ప్రతీ సారి ఎదో ఒక విధంగా సహాయ పడుతూనే ఉంటాడు. ఇప్పటికే వెయ్యికి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన విషయం తెలిసిందే. ఆ విషయంతో మహేష్ రేంజ్ మరింత పెరిగిపోయింది.

ఎవరికి తెలియని కోణం
అయితే మహేష్ బాబు గురించి ఇటీవల అతని మేనల్లుడు అశోక్ గల్లా ఎవరికి తెలియని మరో కోణాన్ని కూడా బయటపెట్టాడు. ప్రస్తుతం అతను హీరో సినిమా రిలీజ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అశోక్ గల్లా తన పర్సనల్ లైఫ్ లోని చాలా విషయాలను చాలా ఓపెన్ గానే చెప్పేస్తున్నాడు.

అందరూ నవ్వుతూ ఉండాలి
అశోక్ తన మామ మహేష్ చాలా సరదా మనిషి అని చెప్పుకొచ్చాడు. ఆయన ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు చాలా క్లోజ్ గా ఉంటారు. ఎదుటి మనిషి నచ్చారు అంటే వారితో చాలా సరదాగా ఉంటారు. ఇక మాతో ఎప్పుడైనా డిన్నర్ కు లేదా లంచ్ కూర్చుంటే అందరూ నవ్వుతూ ఉండాలి. ఆయన ఉంటే వాతావరణం మొత్తం ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుంది.

మహేష్ ముందు బీర్ తాగుతూ..
ఇక తనకు 18 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు మొదటిసారి బీర్ తాగుతూ మహేష్ బాబుకు దొరికిపోయినట్లు చెప్పాడు. ఇంట్లో ఒకసారి చిన్న పార్టీలో బీర్ తాగుతూ ఉండగా సడన్ గా నా వైపు చూసారు. నువ్వు బీర్ తాగుతావా అంటూ వింతగా చూశారు అని అశోక్ తెలిపారు. అయితే ఆ తరువాత నేను కూడా సైలెంట్ గా అలా ఉండిపోయి అలా పక్కకు తిరిగినట్లు చెప్పుకొచ్చాడు.

ఈ వరల్డ్ లో..
ఇక మహేష్ బాబు ఎంత జాయ్ పర్సన్ అంటూ.. ఆయనతో క్లోజ్ గా ఉంటే చాలా హ్యాపీగా ఉంచుతారు అంటూ.. ఈ వరల్డ్ లో నాకు తెలిసి ఆయన లాంటి హ్యాపీ పర్సన్ ను నేను ఇంతవరకు చూడలేదు అని కూడా అశోక్ వివరణ ఇచ్చారు. ఇక అశోక్ నటించిన మొదటి సినిమా హీరో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.