Don't Miss!
- News
2019 జామియా అల్లర్ల కేసు : షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ తన్హాకు విముక్తి కల్పించిన ఢిల్లీ కోర్టు..
- Lifestyle
World CancerDay:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీor సెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Technology
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
SSMB29: రాజమౌళి సినిమాపై మహేష్ ఫస్ట్ రియాక్షన్.. ఎలా సిద్దమవుతున్నాడంటే..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టు గురించి అందరూ చర్చించుకునే టైం వచ్చేస్తోంది. ఎందుకంటే రాజమౌళి RRR సినిమా మరోసారి ఆస్కార్ స్థాయిలో నిలవడంతో ఇప్పుడు ఆయన తదుపరి సినిమా ఎలా ఉంటుందా అని అందరు ఎదురుచూస్తున్నారు. ఇక ఇన్నాళ్లు అయితే మహేష్ బాబు ఎవరి దగ్గర కూడా రాజమౌళి ప్రాజెక్టు గురించి పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ మొదటిసారి మాత్రం మహేష్ బాబు చెప్పిన మాటలు బయటకు ఒక హీరో ద్వారా రావడం విశేషం ఆ వివరాలు లోకి వెళితే..

త్రివిక్రమ్ తో 28వ సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే మహేష్ 28వ ప్రాజెక్ట్ గా ఇది తెరపైకి రాబోతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు గతంలో ఎప్పుడు కనిపించిన విధంగా అందరిని ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఆ సినిమాకు సంబంధించిన గాసిప్స్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని కూడా అనుకుంటున్నారు.

స్క్రిప్ట్ పనుల్లో రాజమౌళి
మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి రాజమౌళి ప్రాజెక్టులోకి షిఫ్ట్ అవ్వాలని కూడా అనుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం మరోవైపు రాజమౌళి పూర్తిస్థాయిలో కథను రెడీ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
మొన్నటి వరకు గోల్డెన్ గ్లొబ్ లో అవార్డ్స్ తో బిజీగా ఉండగా.. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ రావడంతో రాజమౌళి టీం ఆ హడావిడిలోనే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే మహేష్ బాబుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఎలా చూపిస్తాడో..
అసలు ఇంతకు మహేష్ బాబును రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అనేది అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది..ఇక మొదటిసారి వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం అది కూడా రాజమౌళి RRR లాంటి బడా సినిమా తర్వాత చేస్తూ ఉండడంతో భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక హాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీగానే విడుదల చేసే అవకాశం అయితే ఉంది.

మహేష్ ఎలా ఉన్నాడంటే..
ఇక మహేష్ బాబు అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనే విషయంపై ఇటీవల ఒక క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు బావ సుధీర్ బాబు హంట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు గురించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రాజమౌళి గారి సినిమాతో అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మహేష్ బాబు కంప్లీట్ గా వేరే మూడ్ లో ఉన్నారు అని ఈ హీరో తెలియజేశాడు.

ఏం చేయడానికైనా సిద్ధమే..
ప్రస్తుతం మహేష్ బాబు ఉన్న తీరును చూస్తే గతంలో ఎప్పుడు కూడా ఆయనను అలా చూడలేదు. అంతే కాకుండా ఆయన నాతో ఒక మాట కూడా అన్నారు. రాజమౌళి గారితో సినిమా ఒప్పుకున్న తర్వాత ఆయనతో ఎలాంటి వర్క్ చేయడానికి అయినా నేను సిద్ధమే.. ఫైనల్ గా ఏం చేయడానికైనా సిద్ధమే అనే ఒక పొజిషన్లో ఉన్నాను అని మహేష్ బాబు చెప్పినట్లుగా సుధీర్ బాబు వివరణ ఇచ్చాడు. మరి మహేష్ బాబును రాజమౌళి ఎలా ప్రజెంట్ చేస్తాడో కాలమే సమాధానం చెప్పాలి.