twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ ప్రభుత్వానికి షాక్.. వైఎస్ జగన్ సర్కార్ ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు

    |

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై గత కొంతకాలంగా సినిమా ప్రముఖులు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ఇటీవల తీసుకొచ్చిన కొత్త జీవో ఏ మాత్రం సరైనది కాదని విమర్శలు వచ్చాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు అలాగే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా రకాలుగా ఈ విషయంలో ప్రభుత్వ మంత్రులతో చర్చలు జరిపారు. అయితే ఎన్ని చర్చలు జరిపినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సానుకలమైన సమాధానాలు రాలేదు.

    ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కొత్త జీవోను మార్చడం కుదరదని అన్నారు. అయితే ఆ విషయంలో హై కోర్టు ఏపీ ప్రభుత్వానికి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. మంగళవారం హైకోర్టులో ఈ విషయంలో వాదనలు జరిగాయి. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇటీవల అమలు చేసిన జీవో నెం.35ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. ఇక ఈ విషయం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. టికెట్‌ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోపై అభ్యంతరం వ్యక్తం చేసిన థియేటర్‌ యజమానులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. కొత్త జీవోను సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇక వారి వివరణ విన్న అనంతరం పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు కోర్టు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది.

    High court dismissed the orders passed by AP government regarding movie ticket rates.

    ఇక కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో ఇచ్చిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని పిటిషనర్లు వివరణ ఇచ్చారు. టికెట్‌ రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని విన్నవించారు. సీనియర్‌ లాయర్ ఆదినారాయణ రావు, దుర్గా ప్రసాద్‌ పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. ఇక పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదలైన సమయంలోనే టికెట్‌ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్‌ యజమానులకు ఉంటుందని పేర్కొన్నారు. పిటిషనర్‌ తరపు న్యాయవాదులు చేసిన వాదనలతో హైకోర్టు సరైనదని తీర్మానించింది. ఇక ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలు చేయడంతో ఇండస్ట్రీలో విషయం హాట్ టాపిక్ గా మారింది.

    ఇక రానున్న రోజుల్లో పెద్ద సినిమాలకి ఒక విధంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద సినిమాలకు ఎక్కువగా మొదటి వారంలోనే పెట్టిన పెట్టుబడులకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఓ వైపు కరోనా వైరస్ మరోవైపు పైరసీ ప్రభావం వలన ఈ రోజుల్లో సినిమాలకు ఒక వారం కంటే ఎక్కువ బిజినెస్ జరగడం లేదు. ఇక పెట్టిన పెట్టుబడికి సరైన మార్గం టికెట్ల రేట్లు పెంచుకోవాల్సిందే అనే విధంగా కొనసాగుతున్నారు. అయితే అన్ని ఏరియాల్లో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వడం లేదు. ఆ విధంగా రేట్లు పెంచితే సినిమాను థియేటర్ లో చూసే ఆసక్తి కూడా తగ్గుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం ఎప్పటిలానే పెద్ద సినిమాలకు అనుగుణంగా టికెట్ల రేట్లు కొనసాగుతున్నాయి. ఇక పుష్ప సినిమా ఆ రూట్లో ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి. ఆ తరువాత RRR, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు విడుదల కానున్న విషయం తెలిసిందే.

    English summary
    High court dismissed the orders passed by AP government regarding movie ticket rates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X