For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాని మూవీని హిందీలోకి తీసుకెళ్తోన్న దిల్ రాజు.. అక్కడ హీరోగా చేస్తున్నది ఎవరంటే!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో రీమేక్ మూవీల హవా కనిపిస్తోంది. దేశంలోని అన్ని భాషలకు సంబంధించిన చిత్రాలు మిగిలిన ఇండస్ట్రీల్లోకి వెళ్లిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రూపొందిన చిత్రాలకు ఉత్తరాదిలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో మన దగ్గర వచ్చిన సినిమాలను హిందీలోకి రీమేక్ చేయడానికి అక్కడి దర్శక నిర్మాతలు తెగ పోటీ పడుతున్ారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో మూవీలను అనువదించుకున్నారు కూడా. అలా హిందీలోకి వెళ్లిన చాలా తెలుగు సినిమాలు సూపర్ డూపర్ అయ్యాయి. దీంతో మరింత ఉత్సాహంతో రీమేక్‌లు తెరకెక్కుతున్నాయి.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  తెలుగులో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'హిట్: ద ఫస్ట్ కేస్'. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ లీడ్ రోల్‌లో నూతన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. లాక్‌డౌన్‌కు ముందు కొద్ది రోజులే థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.4 కోట్లు జరగగా, అంత క్లిష్ట సమయంలోనూ దాదాపు రూ. 7.50 కోట్ల రాబట్టి సత్తా చాటింది. ఆ తర్వాత ఓటీటీలోనూ ఇది భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకున్న విషయం తెలిసిందే.

  HIT Movie Hindi Remake Launched

  ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి ఘన విజయాన్ని అందుకున్న 'హిట్: ద ఫస్ట్ కేస్' మూవీని తమ తమ భాషల్లోకి రీమేక్ చేయడానికి దేశ వ్యాప్తంగా ఉన్న పేరున్న సంస్థలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే నాని నుంచి చాలా మంది ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోడానికి ప్రయత్నాలు జరిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు 'హిట్: ద ఫస్ట్ కేస్' హిందీ రీమేక్ హక్కులను కొనుగోలు చేసుకున్నారు. అందుకు అనుగుణంగానే బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రొడ్యూసర్లతో కలిసి ఈ ప్రాజెక్టును చాలా రోజుల క్రితమే రాజ్ కుమార్ రావ్ హీరోగా లైన్‌లో పెట్టేశారు.

  Bigg Boss: ఆ అమ్మాయితో అక్కినేని నాగార్జున డేట్.. వామ్మో అందరి ముందే అలా అడిగేశాడేంటి!

  'హిట్: ద ఫస్ట్ కేస్' హిందీ రీమేక్ తాజాగా ప్రారంభం అయింది. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో దిల్ రాజు, శైలేష్ కొలను, హీరో రాజ్ కుమార్ రావ్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలతో ఉంది.

  'హిట్: ద ఫస్ట్ కేస్' హిందీ రీమేక్‌లో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తుండగా.. మిగిలిన వాళ్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. కిషన్ కుమార్, కుల్దీప్ రాథోర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ మూవీని 'హిట్: ద సెకెండ్ కేస్' అనే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విలక్షణ నటుడు అడివి శేష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ పూర్తైన వెంటనే అది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.

  English summary
  HIT: The First Case directed by Sailesh Kolanu Under Nani Production. Now This Movie Hindi Remake Started.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X