RRR సెట్లో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్.. రాజమౌళితో కలిసి యాక్షన్ సీన్లకు స్కెచ్.. వీడియో వైరల్

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న RRR చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకొన్నది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ సీన్లను చిత్రీకరించే పనిలో రాజమౌళి ఉన్నారు. ట్విట్టర్‌లో RRR మూవీ అకౌంట్ ఓ వీడియోను షేర్ చేసింది.

ఈ క్రమంలో యాక్షన్ సీన్ల చిత్రీకరణ కోసం హాలీవుడ్‌కు చెందిన స్టంట్స్ డైరెక్టర్ నిక్ పావెల్ టీమ్‌తో జతకలిశారు. RRR చిత్రం కోసం షూట్ చేసే క్లైమాక్స్ చివరి సన్నివేశాలను పావెల్‌ సెట్ చేయనున్నారు.

యాక్షన్ సీన్ల చిత్రీకరణకు ముందు యూనిట్ సభ్యులతోపాటు నిక్ పావెల్‌తో సన్నివేశాల గురించి రాజమౌళి చర్చించారు. లాప్‌టాప్‌‌లో సన్నివేశాల చిత్రీకరణను వివరిస్తూ కనిపించారు. నేను మీకు చెప్పేది అర్థం అయిందనుకొంటాను అంటూ రాజమౌళి కనిపించారు. కొన్ని యాక్షన్ సీన్ల ట్రయల్స్ కూడా వీడియోలో కనిపించింది.

Hollywood Action Director Nick Powell joins SS Rajamoulis RRR team

లాక్‌డౌన్ తర్వాత RRR చిత్రం షూటింగు జోరుగా కొనసాగుతూ పూర్తయ్యే దశకు చేరుకొన్నది. ఈ చిత్రాన్ని వీలైతే రానున్న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే పలుమార్లు ఈ చిత్ర విడుదల వాయిదా పడిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడా ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X