twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణను టార్గెట్ చేసిన మంచు లక్ష్మి.. రకుల్‌ని కూడా వదల్లేదు! హాట్ టాపిక్

    |

    మంచువారమ్మాయి.. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఏకంగా నందమూరి బాలకృష్ణకే సవాల్ విసిరింది. ఆయన్ను మాత్రమే కాదు ఆమెతో ఎప్పుడూ క్లోజ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, సోదరుడు మంచు మ‌నోజ్‌‌ని కూడా వదిలిపెట్టలేదు మంచు లక్ష్మి. ఇంతకీ అసలు సంగతేంటి? వారిపై ఆమె సవాల్ ఏంటి? వివరాల్లోకి పోతే..

    ఎక్కడ చూసినా అదే.. చివరకు మంచు లక్ష్మి

    ఎక్కడ చూసినా అదే.. చివరకు మంచు లక్ష్మి

    ఎక్కడ చూసినా 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' హవానే కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో నడుస్తున్న ఈ ఛాలెంజ్‌ని పలువురు సెలెబ్రిటీలు సాదరంగా స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తూ చివరకు మంచు లక్ష్మి వద్దకు చేరింది.

    బాలకృష్ణను టార్గెట్ చేసిన మంచు లక్ష్మి

    బాలకృష్ణను టార్గెట్ చేసిన మంచు లక్ష్మి

    యాంకర్ సుమ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటింది ఈ మంచు వారి అమ్మాయి. ఆ తర్వాత తన ఛాలెంజ్‌‌ని సోదరుడు మంచు మ‌నోజ్‌, స్నేహితురాలు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సీనియర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణలకు విసిరింది. దీంతో మంచు లక్ష్మి చేసిన టార్గెట్ హాట్ టాపిక్ అయింది.

    గ్రీన్ ఛాలెంజ్.. మంచు లక్ష్మి రెస్పాన్స్

    గ్రీన్ ఛాలెంజ్.. మంచు లక్ష్మి రెస్పాన్స్

    ఫిలింనగర్‌లో ఉన్న తన సొంత ఇంట్లో మొక్కలు నాటిన మంచు లక్ష్మి.. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పింది.
    ఈ గ్రీన్ ఛాలెంజ్ చాలా ముఖ్యమైన‌ది. ఎన్ని చెట్లు నాటితే పర్యావరణానికి, మానవ మనుగడకు అంత మంచిది అని ఆమె పేర్కొంది. ఈ ఛాలెంజ్ నిరంత‌రాయంగా కొనసాగాలని ఆమె ఆకాంక్షించింది.

    గతంలో యాంకర్ సుమ..

    గతంలో యాంకర్ సుమ..

    ఇక ఇటీవలే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న యాంకర్ సుమ.. కేసీఆర్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపింది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కి, ‘హరితహారం'లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలాగే కొనసాగాలని, ఇందులో ప్రతీ ఒక్కరూ భాగమై పర్యావరణ పరిరక్షణ పాటు పడాలని చెప్పింది.

    సాయి పల్లవి మొదలుకొని బిత్తిరి సత్తి వరకు

    సాయి పల్లవి మొదలుకొని బిత్తిరి సత్తి వరకు

    మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ కార్యక్రమంలో భాగమైన సెలెబ్రిటీలందరికీ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో అక్కినేని అఖిల్, వరుణ్ తేజ్, సాయి పల్లవి, సుమ, మంచు లక్ష్మి, బిత్తిరి సత్తి లాంటి ఎందరో పాల్గొని మొక్కలు నాటారు.

    English summary
    Actress Lakshmi Manchu participated in Green India Challenge. After she forwarded her challenge to Nandamuri Balakrishna and Manchu Manoj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X