IBOMMA: తెలంగాణ పోలీసులకు ఐ బొమ్మ వార్నింగ్.. 5 కోట్ల మంది మా వెంట అంటూ
IBOMMA: మూవీ లవర్స్‌కి 'ఐబొమ్మ'(ibomma)వెబ్‌సైట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొత్త సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయినా, ఓటీటీలో రిలీజ్ అయినా.. గంటల వ్యవధిలోనే పైరసీ చేసి తన వెబ్‌సైట్ లో పెడుతోంది ఈ వెబ్‌సైట్. దీంతో నిర్మాతలు కోట్లాదిగా నష్టపోతున్నారు. సినిమా పెద్దలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఐబొమ్మ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చే స్టేజ్ వెళ్లింది. అసలేం జరిగింది?
'ఐబొమ్మ'మొదట్లో కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను మాత్రమే పైరసీ చేసేది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమాస్, హాట్‌స్టార్, ఆహా వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో స్ట్రీమ్ అవుతున్న కంటెంట్‌ను కొన్ని నిమిషాల్లోనే పైరసీ చేసి సైట్‌లో అప్‌లోడ్ చేసేది. అయితే గత కొంతకాలంగా ఐబొమ్మ ఆగడాలు మరీ మితిమీరాయి. థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలను కూడా గంటల వ్యవధిలోనే హెచ్‌డీ ప్రింట్‌తో పైరసీ చేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ 'పుష్ప 2' నుంచి పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' వరకు పెద్ద సినిమాలే పైరసీ బారిన పడ్డాయి. ఈ పరిణామాలతో నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైరసీకి సంబంధించిన ప్రధానంగా వినిపించే పేర్లు మూవీ రూల్జ్, ఐబొమ్మ. వీటిలో ముఖ్యంగా ఐబొమ్మ సినిమాల పైరసీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.

సినిమా పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ'పై ఇటీవల మాజీ సీపీ సీవీ ఆనంద్ చేసిన హెచ్చరికలకు, ఆ వెబ్‌సైట్ నిర్వాహకులు కౌంటర్ హెచ్చరికలు జారీ చేశారు. పైరసీని ఆపేస్తామని, త్వరలోనే నిర్వాహకులను పట్టుకుని అరెస్ట్ చేసి చూపిస్తామని సీపీ రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి ప్రతిస్పందించిన ఐబొమ్మ నిర్వాహకులు మీడియా, సినిమా ఇండస్ట్రీ, పోలీసులు, డిస్ట్రిబ్యూటర్లను టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే.. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం" అంటూ బహిరంగంగా హెచ్చరించారు. వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే.. "మీ ఫోన్ నంబర్లు, మా సబ్‌స్క్రిప్షన్లు, టెలిగ్రామ్ గ్రూపులు, 5 కోట్ల మందికి పైగా యూజర్ల వివరాలు బహిర్గతం చేస్తాం" అని షాకింగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాక, హీరోల సీక్రెట్ బయట పెడతాం. ఇండస్ట్రీ మొత్తానికి షేక్ చేస్తామని బెదిరించారు.
ఇండస్ట్రీపై తీవ్ర విమర్శలు
ఐబొమ్మ నిర్వాహకులు తెలుగు సినీ పరిశ్రమలోని ఖర్చులు, హీరోల రెమ్యూనరేషన్లు, బడ్జెట్ వ్యవహారాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది."హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? " అని ప్రశ్నించారు. లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్‌కి ఇచ్చే మొత్తం కూలీలా ఉంటే.. హీరో-హీరోయిన్లకి ఇచ్చే అమౌంట్ ఎందుకు అంత ఎక్కువని ప్రశ్నించారు. విదేశాల్లో షూటింగ్స్, ట్రిప్స్ కోసం బడ్జెట్ వృధా చేస్తున్నారు. ఇండియాలో చేస్తే తక్కువ అవుతుంది. ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు. అనవసర బడ్జెట్లు పెంచి డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతున్నారు. దాంతో థియేటర్లలో టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. చివరికి మధ్యతరగతి ప్రజలే ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.
బహిరంగ హెచ్చరిక
తమ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మీరు ఎక్స్‌పోజ్ అవుతారని హెచ్చరించారు. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్‌సైట్లపై దృష్టి పెట్టండి. మా మీద మాత్రమే ఫోకస్ పెట్టవద్దన్నారు. తమ పోస్ట్‌ను కొంత సమయం తరువాత తామే డిలీట్ చేస్తామని, కానీ దానిని ఎవరూ బలవంతం చేసినట్టు చూపించవద్దని కూడా స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











