క్రేజీగా ఐఐటీ కృష్ణమూర్తి టీజర్... క్లాసీ టచ్‌తో ఆసక్తికరంగా!!
క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పణతో ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్న ఐఐటీ కృష్ణమూర్తి చిత్రంలో పృథ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. 'మిస్సింగ్- లాస్ట్ సీన్ సాటర్ డే ఈవినింగ్' అనే క్యాప్షన్స్‌తో ఉన్న ఫస్ట్ లుక్.. సినిమాపై ఆసక్తిని రేపింది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో హీరో సీరియస్ లుక్ మరింత ఆకట్టుకునేలా ఉంది.
వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా టీజర్ ఫిబ్రవరి 24 న రిలీజ్ చేశారు. వేసవి కానుకగా మే 28 న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సినిమా కి నరేష్ కుమారన్ సంగీతం సమకూరుస్తుండగా, యేసు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

ఐఐటీ కృష్ణమూర్తి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. క్వాలిటీ పరంగా చాలా బాగుందనే ఫీలింగ్ కలిగించింది. సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ క్లాసీగా ఉన్నట్టు టీజర్ చెప్పకనే చెప్పింది. నటీనటులు ఫెర్ఫార్మెన్స్ ఎమోషనల్‌గా సాగింది. టీజర్‌లో ఇతర సాంకేతిక విభాగాల పనితీరు చాలా ప్రొఫెషనల్‌గా కనిపించింది. దాంతో సినిమాపై మంచి క్రేజ్‌ను ఏర్పరచడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.
నటీనటులు: పృథ్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు.
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : శ్రీ వర్ధన్
సమర్పణ : ప్రేమ్ కుమార్ పాత్ర
నిర్మాత : ప్రసాద్ నేకూరి
బ్యానర్ : క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీ క్రిష్
సినిమాటోగ్రఫీ: యేసు.పి
సంగీతం: నరేష్ కుమారన్
ఎడిటర్ : అనిల్ కుమార్.పి
రచన : నాగార్జున మనపాక
గీత రచయిత : రామాంజనేయులు సంకర్పూ
లైన్ ప్రొడ్యూసర్ : ఎల్.వి. వాసుకి
ప్రొడక్షన్ కంట్రోలర్ : అశ్విన్ , ఆనంద్ కుమార్
క్యాస్టింగ్ : సూర్య తేజ
కలరిస్ట్ : శ్రీనివాస్ మామిడి
పి.ఆర్.ఓ : సాయి సతీష్


Click it and Unblock the Notifications











