For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ది లెజండ్ శరవణన్ కి పోయింది 80 కోట్లు కానీ లాభం వందల కోట్లు.. ఎలాగో తెలుసా?

  |

  తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ది శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ అరుల్ హీరోగా రూపొందిన ది లెజెండ్ సినిమా 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంటుంది. ఈ సినిమా దారుణంగా ఉందంటూ కొందరు కామెంట్ చేస్తుంటే 80 కోట్లు ఖర్చుపెట్టినందుకైనా ఒకసారి చూడాలని కొందరు భావిస్తున్నారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే 80 కోట్ల రూపాయలు బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా మూవీ చేశారు. దాన్ని ఎవరు చూస్తారు అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సినిమాతో ఆయనకు 80 కోట్ల నష్టం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లేదు ఆయనకు కోట్లలో లాభం కలగబోతోంది అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  నష్టం వాటిల్లడం ఖాయం

  నష్టం వాటిల్లడం ఖాయం

  ది లెజెండ్ సినిమా 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు దారుణమైన నెగటివ్ టాక్ ఉంది. బిలో యావరేజ్ అంటూ కూడా పలువురు క్రిటిక్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మొత్తం 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన నేపథ్యంలో భారీగా నష్టం వాటిల్లడం ఖాయం అనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే డబ్బు ఎక్కువయి సినిమా చేశారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

  ఈజీగా పెట్టరు

  ఈజీగా పెట్టరు


  అయితే ఇక్కడ కొంత మంది ఒక ఆసక్తికరమైన లాజిక్ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే శరవణన్ ఒక నటుడు అయ్యాక వ్యాపారవేత్త కాలేదు వ్యాపారంలో సూపర్ గా సక్సెస్ అయిన తర్వాతే ఆ డబ్బుతో సినిమా తీశారు. సాధారణంగా ఒక వ్యాపారవేత్త ఒక రూపాయి ఖర్చు పెడుతున్నారంటే దానికి కోసం చాలా ఆలోచిస్తారు. ఒక పావలా అయినా లాభం లేనిదే రూపాయి కూడా బయటికి తీయరని అంటూ ఉంటారు. అయితే 80 కోట్ల రూపాయలు బడ్జెట్ తో సినిమా చేయాలంటే శరవణన్ ఎంత ఆలోచించి ఉంటారు? అంత బడ్జెట్ పెడుతున్నారు అంటే అంత ఈజీగా పెట్టరు కదా.

  సెలబ్రిటీలు ఉండేలా

  సెలబ్రిటీలు ఉండేలా


  అయితే ఆయన ఆలోచనలకు పెద్ద బిజినెస్ సీక్రెట్ ఉందనే వాదన వినిపిస్తోంది. అదేమిటంటే సాధారణంగా శరవణన్ స్టోర్స్ లో బట్టలు, బంగారం అమ్ముతూ ఉంటారు. ఎక్కువగా దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలకు భారీ మొత్తంలో ఖర్చుపెట్టి ఇప్పటివరకు యాడ్ కమర్షియల్స్ షూట్ చేస్తూ ఉండేవారు. స్వయంగా అరుల్ శరవణన్ ఆ యాడ్స్ నటించేవారు. కానీ ఆయన అంత పాపులర్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన పక్కన ఒకరిద్దరు సెలబ్రిటీలు ఉండేలాగా ప్లాన్ చేసుకునేవారు. ఒక్కోసారి ఆ సంఖ్య 5 వరకు చేరేదట.

  దేశం మొత్తం

  దేశం మొత్తం


  ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వాల్సి వచ్చేదట. ఇప్పుడు అతి త్వరలో లెజెండ్ శరవణ స్టోర్స్ ఇండియా మొత్తం ప్రారంభించే యువచనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. అప్పుడు యాడ్ కమర్షియల్స్ కాస్ట్ కూడా భారీగా పెరిగా అవకాశం ఉంది. అంతేకాక ఇతను ఎవరు ఎలా ఉన్నాడు అంటూ పాన్ ఇండియా ప్రేక్షకులు అయోమయంలో పడకుండా తన పాన్ ఇండియా వ్యాపారానికి ముందే తనను పరిచయం చేసుకుంటూ దేశం మొత్తం ఒక్కసారిగా ఫోకస్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.

  హీరో అని

  హీరో అని

  ఇకనుంచి కమర్షియల్స్ లో సెలబ్రిటీలు లేకపోయినా ఫలానా సినిమా హీరో అని గుర్తింపు దక్కనే దక్కుతుందని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ఒక బాలీవుడ్ హీరోయిన్ ని కూడా సినిమాలో నటింపచేశారని టాక్ వినిపిస్తోంది. ప్రచారం నెగిటివ్ అయిన పాజిటివ్ అయినా ప్రచారం ప్రచారమే కాబట్టి ఆయన పెట్టిన డబ్బుకు తగిన ప్రచారం ఇప్పటికే దక్కిందని అంటున్నారు. అలా పోయింది 80 కోట్ల అయినా రమ్యునరేషన్లు పబ్లిసిటీ ఖర్చులు లాంటి వ్యవహారాలు చూస్తే వందల కోట్లలో ఆయనకు లాభం వచ్చినట్లే అనే వాదన వినిపిస్తోంది.

  English summary
  The legend movie starred by saravanan released in theatres, some people are saying interesting business trick behind the legend saravanan movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X