Aryan Khan కు అనన్య పాండే మూడుసార్లు గంజాయి సప్లై?.. ఎన్సీబీ విచారణలో కొత్త విషయాలు

బాలీవుడ్ నటి అనన్య పాండేను విచారిస్తున్న క్రమంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు రోజులుగా అనన్య పాండేను లోతుగా విచారిస్తున్నట్టు సమాచారం. ఆర్యన్ ఖాన్, అనన్య మధ్య జరిగిన ఛాటింగ్‌ను ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్సీబీ వెల్లడించినట్టు బాలీవుడ్ పత్రికలు, వెబ్ సైట్లు వెల్లడించిన ప్రకారం మూడుసార్లు ఆర్యన్ ఖాన్‌కు గంజాయి (వీడ్) పంపించినట్టు తెలుస్తున్నది.

గురువారం అనన్య పాండే ఇంటిలో సోదాలు, తనిఖీలు జరిగిన ఎన్సీబీ అధికారులు ఆమె మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. అనన్య ఫోన్లు ఇతర పరికరాలను ఫోరెన్సిక్ శాఖకు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అనన్య పాత మొబైల్‌ను, ఇటీవల కొనుగోలు చేసిన కొత్త మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకొని విచారణ చెప్పినట్టు తెలిసింది.

 Is Ananya Panday sent weed thee time to Aryan Khan?

అయితే శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లే ముందు అనన్య పాండే భోరున విలపించారు. ఆమె వెంట తండ్రి చంకీ పాండే వెళ్లారు. ఆయన ఆఫీస్‌లోని ఫ్రంట్ రూంలో వేచి ఉన్నారు. అధికారులు ప్రశ్నించిన సమయంలో అనన్య పాండే చాలా కామ్‌గా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

వాట్సప్ ఛాట్‌లో ఆర్యన్ ఖాన్‌తో జుగద్, వీడ్ అంటూ వాడిన పదాల గురించి అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు సమాచారం.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత సినీ తారలతో డ్రగ్స్ లింక్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో భాగంగా వాట్సాప్ ఛాట్స్‌పై దృష్టిపెట్టిన ఎన్సీబీకి యువ హీరోయిన్ అనన్య పాండే వ్యవహారం బయటపడింది. వాట్సప్ ఛాట్‌లో ఆర్యన్ ఖాన్, అనన్య పాండే డ్రగ్స్ సమకూర్పు, కోనుగోలు గురించి చర్చించుకొన్నట్టు ఎన్సీబీ అధికారులు ఆరోపించారు. తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ముంబై కోర్టుకు సమర్పించడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X