For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సాహో‌ టీజర్‌తో ఆ నష్టం.. సరిదిద్దుకొనేందుకు రజనీ బాటలో ప్రభాస్!

  |

  బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 15 తేదిన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న విషయాలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సినిమా కంటెంట్‌కు సంబంధించిన వార్త మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే..

   సాహో టీజర్‌తో

  సాహో టీజర్‌తో

  ప్రభాస్ పుట్టిన రోజున అంటే అక్టోబర్ 23వ తేదీన రిలీజ్ చేసిన సాహో టీజర్‌ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో కొన్ని అనుమానాలను రేకేత్తించింది. యాక్షన్ సీన్లు, అగ్రెసివ్ మేకింగ్ చూసి ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమనే భ్రమను కలిగించింది. కానీ సాహో చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకొనే కామెడీ కూడా ఉందట.

   సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఫాలో

  సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఫాలో

  సాహో సినిమాలోని కామెడీకి సంబంధించిన విషయంలో ప్రభాస్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఫాలో అయ్యాడని మీడియాలో కథనం వెలువడింది. రజనీకాంత్ సినిమాలో ఉండే మాదిరిగా సున్నితమైన హాస్యం ప్రేక్షకులు అందించే ప్రయత్నం చేశారని పేర్కొన్నది.

  సన్నివేశాల్లోనే కామెడీ ట్రాక్

  సన్నివేశాల్లోనే కామెడీ ట్రాక్

  సాహోలో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్‌ను పెట్టకుండా కథ, సన్నివేశాల్లోనే హస్యాన్ని పండించే విధంగా దర్శకుడు సుజిత్ జాగ్రత్తలు తీసుకొన్నాడట. సాధారణంగా రజనీకాంత్ చిత్రాల్లో సపరేటుగా కామెడీ ట్రాక్ ఎక్కడా కనిపించదు. సన్నివేశాల్లోనే హస్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటారు. అదే ఫార్మాలాను ప్రభాస్ పాటించాడని తాజా సమాచారం.

  మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

   స్పై థ్రిల్లర్‌గా సాహో మూవీ

  స్పై థ్రిల్లర్‌గా సాహో మూవీ

  సాహో చిత్రం అంతర్జాతీయ స్పై థ్రిల్లర్‌గా రూపొందిందని మాట మీడియాలో బలంగా వినిపిస్తున్నది. ప్రభాస్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడట. డైరెక్టర్ సుజిత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్, ఇవ్లాన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి తదితరులు నటిస్తున్నారు.

  300 కోట్ల బడ్జెట్‌తో

  యూవీ క్రియేషన్స్, టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూ.300 కోట్ల బడ్జెట్‌తో సాహో చిత్రం రూపొందింది. ఈ చిత్రం కోసం దుబాయ్‌లో చిత్రీకరించిన ఫైట్స్ హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రానికి ఆర్ మాధి సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.

  English summary
  Saaho is an action film, written and directed by Sujeeth, and produced by UV Creations, T-Series and Dharma Productions.The film stars Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh and Evelyn Sharma, and is being shot simultaneously in Telugu, Tamil and Hindi. Reports suggest that Saaho has revealed that the film will have humour like a typical Rajinikanth film, known for their subtle comedy throughout the movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more