షారుక్ అభిమానులకు శుభవార్త.. క్రేజీ ప్రాజెక్ట్‌తో రెడీ.. డైరెక్టర్ ఎవరంటే
వరుస ఫెయిల్యూర్‌తో అభిమానులను షాక్‌లో ముంచిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎట్టకేలకు శుభవార్తను అందించారు. ఏడాది కాలంగా వెండితెరకు దూరమైన ఈ హీరో మళ్లీ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఇటీవల ఆయన నటించిన జీరో మూవీతోపాటు హ్యారీ మెట్ సెజల్ లాంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. ఇంతియాజ్ అలీ, ఆనంద్ ఎల్ రాయ్ లాంటి దర్శకులు కూడా షారుక్‌ను విజయాల బాట పట్టించలేకపోయారు. దాంతో సినిమాల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు షారుక్.

తాజాగా రాజ్ కుమార్ హిరాణీ రూపొందించబోయే సినిమాకు షారుక్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది బాలీవుడ్ మీడియా సమాచారం. షారుక్, రాజ్ కుమార్ హిరానీ అందించే సినిమాకు విదూ వినోద్ చోప్రా నిర్మిస్తున్నట్టు సమాచారం.
గతంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమా కోసం షారుక్‌ను సంప్రదించగా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. ఆ చిత్రంతో సంజయ్ దత్ మంచి పాపులారిటీని సొంతం చేసుకోవడం తెలిసిందే. ఇక చాలా ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











