twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మమ్ముట్టితో ‘యాత్ర’ ముగిసింది... రిలీజ్ ఎప్పుడంటే..?

    |

    మమ్ముటితో మా యాత్ర ముగిసింది. 390కి పైగా సినిమాలు, 3 నేషనల్ అవార్డులు, 60కి పైగా కొత్తదర్శకులతో పని చేసిన అనుభవం ఆయన సొంతం. అన్నంటికీ మించి ఆయన గొప్ప మెంటర్, అద్భుతమైన మానవతావాది అంటూ... 'యాత్ర' దర్శకుడు మహి వి రాఘవ్ చెప్పుకొచ్చారు.

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'యాత్ర' షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆయన తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా మమ్ముట్టి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఆయన నిరూపించుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. ఆయన ఒక లెజెండ్. తెలుగులో స్క్రిప్టు విని, ప్రతి పదం అర్థం అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంశం తన బాషలో రాసుకుని ఆ లైన్లను తెలుగులో అద్భుతంగా డెలివరీ చేశారు. ఈ సినిమాకు సొంతగా డబ్బింగ్ చెప్పారు... అని మహి వి రాఘవ్ తెలిపారు.

    ఈ పాత్రలో ఆయన తప్ప మరెవరూ సూట్ అవ్వరు అనే స్థాయిలో జీవించారు. అలాంటి గొప్ప నటుడితో కలిసి పని చేయడం నా అదృష్టం అని మహి వి రాఘవన్ వ్యాఖ్యానించారు.

    Its the end of our Yatra with Mammootty: Mahi v Raghav

    డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలను అనసూయ, పోసాని, వినోద్ కుమార్, సచిన్ ఖేడేకర్ పోషిస్తున్నారు.

    English summary
    "Its the end of our Yatra with Mammootty. He has nothing to prove. He can simply walk away into the sunset and still remain a legend. It is our tradition and culture to respect our guest. Sure, you can criticise him and tear him apart if he has failed as an actor or has not lived up to your expectation. As a critic and audience, you are entitled to it. But here is an actor who listened to the script in telugu, Learnt the meaning of every word, wrote every single word in his language and delivered the lines on the set superbly. Here is an actor who dubbed and re-dubbed every line to make it as authentic it can be. He is so much in love with our language, culture and films and has nothing but admiration for it." Director Mahi v Raghav said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X