twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న‌టుడు బెన‌ర్జీకి అరుదైన గౌరవం.. జంధ్యాల స్మారక అవార్డుకు ఎంపిక

    |

    తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో మూడు ద‌శాబ్ధాల సుదీర్ఘ అనుభ‌వం ఉన్న న‌టుడు బెన‌ర్జీకి అరుదైన గౌరవం దక్కింది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన బెనర్జీ న‌టుడిగా మారారు. ఆ తర్వాత విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న చేసిన సేవ‌ల నేపథ్యంలో ఆయ‌న‌కు జంధ్యాల మెమోరియ‌ల్ పుర‌స్కారాన్ని అందించ‌నున్నారు.

    జూలై నెల 28న విజ‌య‌వాడ‌లో సుమ‌ధుర క‌ళానికేత‌న్స్ బెన‌ర్జీకి జంధ్యాల స్మారక పుర‌స్కారాన్ని అందించ‌నున్నారు. విజ‌య‌వాడ‌ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

    జ‌న‌తా గ్యారేజ్, కిక్, మ‌ల్లేశ్వ‌రి, స‌మ‌ర్థుడు, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, చంటి, కిల్ల‌ర్, రక్ష‌ణ‌, గాయం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో బెన‌ర్జీ అద్భుత‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లోనూ ప‌లు విభాగాల్లో ఆయ‌న‌ కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

    Jandhyala memorial award for Actor Benerjee

    విజయవాడలో ఈ నెల 28న జ‌ర‌గ‌నున్న అవార్డుల ప్రదానోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తుననారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ నిర్వాహ‌కులు భాస్క‌ర్ వెల్ల‌డించారు. ఆంధ్రప్ర‌దేశ్ వ్యాప్తంగా ఉన్న‌ ప‌లువురు రంగస్థల నటులు ఈ వేదిక‌పై హాస్య ప్ర‌ధాన‌ స్కిట్‌ల‌లో పార్టిసిపెంట్ చేస్తున్నార‌ని తెలిపారు.

    తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య బ్రహ్మగా పేరున్న దర్శకుడు, నటుడు, రచయిత జంధ్యాల ఎన్నో కుటుంబ పరమైన చిత్రాలను అందించారు. ఆనంద భైరవి, పడమట సంధ్యారాగం, ఆపద్భాందవుడు, శ్రీవారికి ప్రేమలేఖ చిత్రాలు మంచి పేరునే కాకుండా అవార్డులను కూడా తెచ్చిపెట్టాయి. ముద్దమందారం, రెండుజెళ్ల సీత, జయమ్ము నిశ్చయంబురా లాంటి చిత్రాలు మంచి ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన 2001 జూన్ 19న మరణించిన విషయం తెలిసిందే.

    English summary
    Actor Benerjee got prestigious Jandhyala memorial award. Benerjeee knows versatile actor in Telugu Industry. This award function to be held in Vijayawada on July 28th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X