For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్కడ కూడా సత్తా చాటిన ‘జాతి రత్నాలు’: బడా చిత్రాల రేంజ్‌లో దక్కిన రేటింగ్

  |

  బడా స్టార్లు నటించలేదు.. సీనియర్ దర్శకుడూ కాదు.. అనుభవం ఉన్న నిర్మాణ సంస్థ కూడా కాదు.. పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు.. అయితేనేం భారీ చిత్రాల రేంజ్‌లో విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది 'జాతి రత్నాలు'. విలక్షణ నటనతో విభిన్నమైన చిత్రాలు చేస్తూ ఔరా అనిపిస్తోన్న నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన దీన్ని అనుదీప్ కేవీ అనే దర్శకుడు తెరకెక్కించాడు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం థియేటర్లలో నవ్వుల జల్లు కురిపించింది. తద్వారా సక్సెస్‌ను అందుకుని నిర్మాతలపై వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'జాతి రత్నాలు' మూవీ థియేటర్లలో ప్రభంజనం సృష్టించింది. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో వసూళ్లు లభించాయి. కోవిడ్ వల్ల ప్రేక్షకుల థియేటర్లకు రావడానికి భయపడుతోన్న సమయంలో విడుదలైనప్పటికీ.. ఇది జనాలను రప్పించుకోగలిగింది. తద్వారా మంచి ఫలితాన్ని అందుకుంది. 'జాతి రత్నాలు' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.52 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 27.02 కోట్లు లాభాలను అందుకుంది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎన్నో రికార్డులను కూడా ఈ మూవీ ఖాతాలో వేసుకుని సత్తా చాటింది.

   Jathi Ratnalu Got 10.21 TRP in First Time

  పూర్తి స్థాయిలో ఫన్ రైడ్‌తో థియేటర్లలో ఓ రేంజ్‌లో సందడి చేసిన 'జాతి రత్నాలు' మూవీ.. బుల్లితెరపైనా హవాను చూపించింది. ఈ చిత్రం ఇటీవలే టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయింది. దీనికి చిన్నతెరపై కూడా అంతే స్థాయిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ చిత్రానికి 10.21 టీఆర్పీ రేటింగ్ దక్కింది. బడా స్టార్లు నటించిన పెద్ద పెద్ద చిత్రాలకు మాత్రమే ఈ రేంజ్‌లో రేటింగ్ వస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు 'జాతి రత్నాలు' సినిమాను కూడా ప్రేక్షకులు అదే రీతిలో ఆదరించారు. ఫలితంగా దీనికి ఇంత రేటింగ్ దక్కిందని చెప్పొచ్చు.

  'జాతి రత్నాలు' ఈ ఏడాది విడుదలైన టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇంత సక్సెస్‌ అయిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది. ఈ చిత్రంలో హీరో నవీన్ పోలిశెట్టి అతడి గ్యాంగ్ జోగీపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు చూపించారు. అయితే, ఈ మూవీ సీక్వెల్‌లో మాత్రం వీళ్లంతా అమెరికా వెళ్లి అక్కడ రచ్చ చేసింది చూపించబోతున్నట్లు దర్శకుడు కొద్ది రోజుల క్రితమే ఓ హింట్ ఇచ్చాడు. ఇక, ఈ స్క్రిప్టులో నిర్మాతగా వ్యవహరించిన మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా సహాయం చేస్తున్నాడన్న టాక్ వినిపించిన విషయం తెలిసిందే.

  షర్ట్ మొత్తం విప్పేసి 'ఎవడు' హీరోయిన్ హాట్ షో: తల్లైన తర్వాత కూడా ఇంత ఘాటుగానా!

   Jathi Ratnalu Got 10.21 TRP in First Time

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'జాతి రత్నాలు' మూవీలో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా జంటగా నటించగా.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులోని చిట్టి అనే సాంగ్ ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  English summary
  Naveen Polishetty and Faria Abdullah Starrer Jathi Ratnalu Movie Super Hit at Box Office. Now This Movie Got 10.21 TRP in Television for the First Time.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X