twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాక్ట‌ర్‌గా ఇష్ట‌ప‌డేవాడిని, అంత‌కు మించి కాదు.. మెగాస్టార్‌పై హీరో సంచలన కామెంట్స్

    |

    ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుని ఉంది. ఈ వైరస్ విజృంభణకు కట్టడి వేసేందుకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. సినీ పరిశ్రమ పూర్తిగా స్థంభించిపోయింది. దీంతో దినసరి కూలీలెంతో మంది దిక్కుతోచని వారయ్యారు. వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నాటి హీరో జేడీ చక్రవర్తి స్పందించాడు.

    సీసీసీ ద్వారా సాయం..

    సీసీసీ ద్వారా సాయం..

    మొదటగా కోటి రూపాయల విరాళమిచ్చి సీసీసీని ప్రారంభించిన చిరు.. తోటీ నటీనటులకు పిలుపునిచ్చాడు. చిరు పిలుపు మేరకు ఎంతో మంది కదిలివచ్చారు. సీనియర్, జూనియర్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇలా ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చారు. ఇలా అందరూ విరాళం ఇవ్వడంతో దాదాపు 8 కోట్ల విరాళాన్ని సేకరించారు. దీంతో సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు.

    అంత‌కు మించీ కాదు.

    అంత‌కు మించీ కాదు.

    సీసీసీని ఏర్పాటు చేసిన చిరంజీవిని అభినందిస్తూ...‘ప్రియమైన చిరంజీవిగారు..నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మీమ్మల్ని ఒక కంప్లీట్ యాక్ట‌ర్‌గా ఇష్ట‌ప‌డేవాడిని.. అంత‌కు మించి కాదు. నా త‌రం నటులంద‌రూ మీతో చ‌క్క‌గా క‌లిసిపోయేవారు... నేనెప్పుడూ అలా చేయ‌లేదు, చేయాల‌నుకోలేదు.

    నేనూ ఆర్థిక సమస్యల్లోనే..

    నేనూ ఆర్థిక సమస్యల్లోనే..


    క‌రోనాప్ర‌భావంతో ప్ర‌పంచ‌మంతా ఆగిపోయింది. సినిమా ప‌రిశ్ర‌మ ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితులను చవిచూస్తోంది. ప్ర‌స్తుతం సినిమా ఇంత‌కు ముందెన్న‌డూ లేనంత ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంది. ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను మీతో పాటు నేను కూడా ఫేస్ చేస్తున్నాను.

    Recommended Video

    MMOF Telugu Movie Trailer || J D Chakravarthy || Akshatha || Manoj Nandan || Akshitha || Benerjee
    కేవలం మెగాస్టార్ అని చెప్పలేం..

    కేవలం మెగాస్టార్ అని చెప్పలేం..

    ఇప్పుడు మీరు చేస్తున్న ప‌ని మీమ్మ‌ల్ని ఒక మెగాస్టార్ అని చెప్ప‌లేం.. గొప్ప వ్య‌క్తిగా అభివ‌ర్ణించాలి. సినీ రంగంలోని ప‌లు శాఖ‌ల‌కు చెందిన కార్మికులు నాకు ఫోన్ చేసిన‌ప్పుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆక‌లి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేశార‌ని తెలిపారు. మీరు ఇండ‌స్ట్రీ రుణం తీర్చుకుంటున్నాన‌ని అంటున్నారు కానీ కార్మికుల ప‌ట్ల అది మీకున్న గౌర‌వంగా భావిస్తున్నాను. ఎప్ప‌టికీ మీ అభిమానిని, అనుచ‌రుడిని' అంటూ ఓ లేఖను విడుదల చేశాడు.

    English summary
    JD Chakravarthy About Chiranjeevi On Corona Crisis Charity. JD Chakravarthy Praised Chiranjeevi Intiating About CCC.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X