For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అంచనాలు పెంచేసింది: నాని పెర్ఫార్మెన్స్ అదుర్స్, భావోద్వేగాలతో ‘జెర్సీ’ ట్రైలర్

  |
  Jersey Theatrical Trailer Review | Nani Shraddha Srinath | Anirudh | Gowtam Tinnanuri | Filmibeat

  నాని హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'జెర్సీ'. పి.డి.వి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌‌గా నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

  భావోద్వేగాలతో కూడిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇది కేవలం క్రికెట్ గురించిన సినిమా కాదు... ఒక ఆటగాడి జీవితంలోని సంఘర్షణ నేపథ్యంలో 'జెర్సీ' సాగుతుందని స్పష్టమవుతోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

  అద్భుతమైన ప్రేమకథ

  అద్భుతమైన ప్రేమకథ

  క్రికెటర్ అర్జున్, సారా మధ్య జరిగే అద్భుతమైన ప్రేమ సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది. వీరి మధ్య జరిగే లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని స్పష్టమవుతోంది. క్రికెట్‌‌కు దూరమైన అర్జున్ ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనయ్యాడనేది సినిమాలో చూపించబోతున్నామనే హింట్ ఈ ట్రైలర్ ద్వారా ఇచ్చారు.

  10 ఏళ్ల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టి...

  10 ఏళ్ల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టి...

  ‘మీరు చెప్పిందే కరెక్ట్ సర్.. నేను ఈ రోప్‌లో తప్ప బయట బ్రతకలేను'' అని రియలైజ్ అయిన అర్జున్ పదేళ్ల తర్వాత, 36 ఏళ్ల వయసులో తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్లోకి అడుగు పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? తనను తాను ఎలా నిరూపించుకున్నాడు అనేది సినిమాలో చూపించబోతున్నారు.

  తండ్రి కొడుకుల సెంటిమెంట్

  తండ్రి కొడుకుల సెంటిమెంట్

  ఈ చిత్రంలో తండ్రికొడుకుల సెంటిమెంట్ హైలెట్ అయ్యేలా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు వరకు నన్ను జడ్జ్ చేయంది నా కొడుకు ఒక్కడు మాత్రమే' అంటూ నాని చెప్పే డైలాగ్స్ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఒక అంచనాకు వచ్చేలా చేస్తోంది.

  క్రికెటర్ అర్జున్ కథ

  క్రికెటర్ అర్జున్ కథ


  ప్రతిభగల క్రికెటర్ అయిన అర్జున్... ఎందుకు 26 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు దూరం అయ్యాడు? పదేళ్ల తర్వాత మళ్లీ అతడు గ్రౌండ్లోకి దిగి బ్యాట్ పట్టడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? అనేది తెరపై ఆసక్తికరంగా చెప్పబోతున్నారు.

  జెర్సీ ట్రైలర్

  నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర,రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన తారాగణంగా నటించారు. సంగీతం: అనిరుద్ రవిచందర్, కెమెరా: సాను జాన్ వరుఘీస్ , ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట్ రత్నం (వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగ వంశి, కధ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.

  English summary
  Presenting you the Theatrical Trailer of JERSEY ft. Nani, Shraddha Srinath. Directed by Gowtam Tinnanuri & Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. This 19th April, Arjun will emerge victorious.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more