twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి స్ట్రాటజీ మామూలుగా లేదే.. లాక్‌డౌన్‌లోనే ఎన్టీఆర్, రాంచరణ్‌తో..

    |

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్‌ను ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లారు. అలాంటి సామర్థ్యం ఉన్న జక్కన ఇప్పుడు RRR విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలువుతుండగా.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌ ఇద్దరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలకు భంగం కలిగించకుండా వారి సేవలను ఉపయోగించుకొంటున్నారనే విషయం మీడియాకు చేరింది. అదేమిటంటే..

    RRR టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌తో

    RRR టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌తో


    కరోనావైరస్‌తో ఆందోళనలో ఉన్న ప్రజలకు తన సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ టీజర్‌తో రాజమౌళి ముందుకు వచ్చారు. రెండు రోజులు ఆగి రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మరోసారి ఎన్టీఆర్ చేతుల మీదుగా మరో టీజర్‌ను ప్రేక్షకుల మీదకు వదలగా దానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇలాంటి సమయంలో టైం వేస్ట్ చేయకుండా సినిమా పనులు లోగుట్టుగా కానిచ్చేస్తున్నారట.

    డబ్బింగ్ పనులు జోరుగా

    డబ్బింగ్ పనులు జోరుగా


    కరోనావైరస్ కారణంగా రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. అయితే ప్రస్తుతం RRR మూవీని అనుకొన్న సమయంలోనే రిలీజ్ చేసే ఆలోచనల ఉన్న రాజమౌళి వారితో డబ్బింగ్ పనులు పూర్తి చేయిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. దాంతో రానున్న రోజుల్లో ఏకంగా ఫైనల్ మిక్సింగ్‌కు వెళ్లడానికి అనువుగా పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.

    స్వయంగా రాజమౌళి పర్యవేక్షణ

    స్వయంగా రాజమౌళి పర్యవేక్షణ

    ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ ఇంట్లో ఉన్న హోం థియేటర్లను పూర్తిస్థాయి డబ్బింగ్ స్టూడియోగా మార్చేశారని, అందులోనే హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తున్నారనేది తాజా సమాచారం. డబ్బింగ్ పనులను స్వయంగా రాజమౌళి, లిరిక్ రైటర్ మదన్ కార్కితో కలిసి పర్యవేక్షిస్తున్నారని ఆంగ్ల దిన పత్రిక కథనాన్ని వెల్లడించింది.

    Recommended Video

    RRR Movie Release May Postpone Again Because Of Chiranjeevi
    25 శాతం షూటింగ్ పెండింగ్

    25 శాతం షూటింగ్ పెండింగ్


    RRR సినిమా వివరాలను నిర్మాత డీవీవీ దానయ్య వెల్లడిస్తూ.. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ఇంకా పెండింగ్‌లో ఉన్న 25 శాతం పూర్తి చేయాల్సి ఉంది. కరోనా లాక్‌డౌన్ ఎత్తివేయగానే, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోగానే షూటింగ్‌ను ప్రారంభిస్తాం అని చెప్పారు. అలియాభట్, అజయ్ దేవగన్, ఓలివియా మోరీస్, సముద్రఖని నటిస్తున్న ఈ చిత్రం జనవరి 8వ తేదీన రిలీజ్ కానున్నది.

    English summary
    SS Rajamouli, Junior NTR and Ram Charan are busy with RRR movie dubbing works. Report said that both Jr NTR and Ram Charan have converted mini theatres in their home into dubbing studios and have been dubbing under the supervision of director Rajamouli and lyric writer Madhan Karky.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X