twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR Birth anniversary: మా గుండెలను తాకి పోండి తాతా అంటూ తారక్ ఎమోషనల్.. మెగాస్టార్ భారతరత్న డిమాండ్

    |

    తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచం ముందు ఉంచిన నెంబర్ వన్ హీరోలలో నందమూరి తారకరామారావు ఒకరు. కేవలం ఒక నటుడిగానే కాకుండా మంచి మానవత్వ విలువలున్న ఒక గొప్ప నాయకులు కూడా. ఇక నేడు ఆయన 98వ జన్మదిన సందర్భంగా తెలుగు లోకమంతా ఆయనను స్మరించుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా స్పందించగా మెగాస్టార్ చిరంజీవి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    వెండితెరపై రారాజుగా

    వెండితెరపై రారాజుగా

    నందమూరి తారకరామారావు 1923 మే 28న జన్మించారు. ఆయన చిన్నతనం నుంచి నాటకరంగం వైవు అడుగులు వేస్తూ యుక్త వయసులో వెండితెరపై రారాజుగా ఎదిగారు. దేవుళ్ళు అంటే ఇలానే ఉంటారేమో అనేలా ఎన్నో భక్తిరస చిత్రాలను అందించారు. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సినీ తారలు కూడా ఆయనను స్మరించుకుంటున్నారు.

    మా గుండెలను మరొక్కసారి తాకి పోండి

    మా గుండెలను మరొక్కసారి తాకి పోండి

    నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తాతను స్మరించుకుంటు మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా అని ఎమోషనల్ గా పేర్కొన్నారు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది పెద్దమనసుతో ఈ ధరిత్రిని , ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా... సదా మీ ప్రేమకు బానిసను..' అంటూ తారక్ ట్వీట్ చేశాడు.

    మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ ట్వీట్

    మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ ట్వీట్

    ఇక మెగాస్టార్ చిరంజీవికి సీనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ సినిమాల్లో మెగాస్టార్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. మెగాస్టార్ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన తరువాత కూడా తన అభిమాన హీరోల్లో ఆయన ఒకరు అంటూ సగర్వంగా చాటుకున్నారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుబావుడికి భారతరత్న ప్రకటించాలని కూడా ఆయన తెలిపారు.

    Recommended Video

    Sr NTR పై Fanism చాటుకున్న Megastar, 100వ జయంతికి రావాల్సిందే!! || Filmibeat Telugu
     ఎన్టీఆర్ కు భారతరత్న.. తెలుగు వారికి దక్కే గౌరవం .

    ఎన్టీఆర్ కు భారతరత్న.. తెలుగు వారికి దక్కే గౌరవం .

    ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశంగర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98 వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ.. అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

    English summary
    Nandamuri Tarakaramaravu is one of the number one heroes who have put the Telugu film industry at the forefront of the world. Not just an actor but also a great leader with good human values. Today, on the occasion of his 98th birth anniversary, the entire Telugu world is remembering him. Junior NTR reacted emotionally and demanded that megastar Chiranjeevi give him the Bharat Ratna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X