Just In
- 3 min ago
పవన్ కల్యాణ్ పేరిట సరికొత్త రికార్డు: ఏకంగా 90 గంటల నుంచి హవాను చూపిస్తూ సత్తా!
- 35 min ago
‘ఢీ’లో అలాంటి వ్యవహారాలా?.. కంటెస్టెంట్లతో మాస్టర్ల అఫైర్స్.. బయటపెట్టేసిన సుమ
- 47 min ago
వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుక: ‘F3’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన వెంకటేష్
- 58 min ago
Box office: 5వ రోజు రెడ్, అల్లుడు అదుర్స్ కలెక్షన్స్.. రామ్ టార్గెట్ ఫినిష్.. ఇంకా పైకిరాని బెల్లంకొండ
Don't Miss!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- News
అమరావతిపై జగన్ సర్కారుకు భారీ షాక్- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ కొట్టేసిన హైకోర్టు
- Automobiles
కొత్త హోండా వెజెల్ ఎస్యూవీ టీజర్ విడుదల
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బన్నీని బావా అనేసిన ఎన్టీఆర్.. అల వైకుంఠపురములోపై యంగ్ టైగర్ ప్రశంసలు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. తన మాటలతోనే మాయ చేస్తాడని మరోసారి నిరూపించాడు. పాత కాలం నాటి లైన్‌ను పట్టుకుని ఇప్పటి కాలానికి అనుగుణంగా అందరికీ నచ్చే కథనంతో, తనదైన శైలిలో అల వైకుంఠపురములో చిత్రాన్ని తెరకెక్కించాడు. ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్న అల్లు అర్జున్.. సరైన సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడనిపించుకున్నాడు.

పాజిటివ్ టాక్‌తో..
సినిమా రిలీజ్‌కు ముందే పాటలతో సగం హిట్ కొట్టేసింది అల వైకుంఠపురములో. ఇక ఆల్బమే ఆ రేంజ్‌లో హిట్ అయ్యేసరికి సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. అయితే వాటికి తగ్గట్టే సినిమా ఉండటం, బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్, తమన్ మ్యూజిక్ ఇలా ప్రతీ ఒక్కటి అల వైకుంఠపురములో చిత్రాన్ని హిట్ చేశాయి.

విజయోత్సవంలో టీమ్..
ఈ సినిమాకు మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. చిత్ర నిర్మాత అయిన రాధాకృష్ణ (చినబాబు), త్రివిక్రమ్, అల్లు అర్జున్ కేక్ కట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇరువురు ఆప్యాయంగా హత్తుకున్నారు. అనంతరం నిర్మాత మీడియాతో ముచ్చటించాడు.
|
‘అల'పై స్పందించిన ఎన్టీఆర్..
అల వైకుంఠపురములో చిత్రంపై ఎన్టీఆర్ స్పందించాడు. ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు బన్నీ, త్రివిక్రమ్, మురళీ శర్మను పొగుడుతూ ట్వీట్స్ చేశాడు. ఈ క్రమంలోనే బన్నీని బావా అనేశాడు.

కంగ్రాట్స్ బావా..
‘అల్లు అర్జున్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అల వైకుంఠపురములో చిత్రాన్ని చూడదగ్గ గొప్ప చిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు. కంగ్రాట్స్ బావా, సామీ' అని ట్వీట్ చేశాడు.

మురళీ శర్మకు హ్యాట్సాఫ్..
‘మురళీ శర్మ అద్భుతమైన నటనకు, తన నటనతో అల్లు అర్జున్, త్రివిక్రమ్‌కు సపోర్ట్ చేసింనందుకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తమన్ అందించిన సంగీతం అతి పెద్ద బలం. ఎంతో గొప్పగా తమన్ పనిచేశాడు. సినిమాటోగ్రఫర్ పీఎస్ వినోద్‌కు ప్రత్యేకంగా ప్రశంసించాలి. చిత్రబృందానికి కంగ్రాట్స్, హారిక అండ్ హాసిని ఎంతో బాగా నిర్మించింద'ని చెప్పుకొచ్చాడు.