ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ డేట్ ఫిక్స్: ఆరోజే పూజా కార్యక్రమం.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకుంటూ ఫుల్ జోష్‌ మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఇందులో భాగంగానే గతంలో తనకు 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్‌ను అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమై వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. దానికి సంబంధించిన అప్‌డేట్ మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. రెండు రోజుల క్రితం చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ ఓ ఫొటోను షేర్ చేస్తూ.. తారక్ గారి ముప్పైవ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుంది అని వెల్లడించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను జనవరి 14న అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ షూటింగ్ మాత్రం RRR పూర్తయిన తర్వాతనే ప్రారంభం అవుతుందని అంటున్నారు.

Jr NTR - Trivikram Movie Starting date fix

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెడుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇటీవల దీనికి 'రాజా వచ్చినాడు' అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఇక, ఈ మూవీలో తారక్ రెండు పాత్రలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒకరు బాలీవుడ్ నుంచి వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X